వైద్యుల నిర్లక్ష్యం..శిశువు మృతి: ఆరోగ్య శ్రీ సేవలు ఉన్నా..ప్రసవానికి రూ. 2లక్షలు వసూలు

వైద్యుల నిర్లక్ష్యం..శిశువు మృతి: ఆరోగ్య శ్రీ సేవలు ఉన్నా..ప్రసవానికి రూ. 2లక్షలు వసూలు

The baby died due to doctors negligence : పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు సూర్య నర్సింగ్ హోమ్ వద్ద కొంతమంది ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం వలన తమ పసిపిడ్డ మరణించాడని ఆరోపించారు. ఆరోగ్యవంతంగా పుట్టిన మగ బిడ్డ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృత్యువాత పడ్డారని ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని బాధితులు ఆందోళన చేపట్టారు.

నిన్న రాత్రి నుంచి చిన్నారి ఏడుస్తున్నా.. వైద్యులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆ పసికందు చనిపోయాడని కన్నీరుమున్నీరయ్యారు. ఆరోగ్యశ్రీ సేవలు ఉన్నప్పటికీ.. తమతో 42వేల రూపాయలు కట్టించుకొని డెలివరీ చేశారని బాధితురాలి బంధువులు తెలిపారు.

ఇప్పటివరకు రెండు రోజులకోసారి 5వేల చొప్పున మొత్తం రెండు లక్షల రూపాయలు కట్టామని వాపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. హాస్పిటల్‌కు చేరుకున్నారు. బాధితులతో మాట్లాడి..న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.