Tirupati : తిరుపతిలో పలు సర్వే నెంబర్లపై రిజిస్ట్రేషన్ నిషేధం ఎత్తివేత

ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో భూముల రిజిస్ట్రేషన్ వ వాదం సమసిపోయింది. తిరుపతిలో పలు సర్వే నెంబర్లలోని భూముల ఆస్తులపై ఇటీవల విధించిన నిషేదాన్ని రిజిస్ట్రేషన్ శాఖ ఎత్తివేసింది.

Tirupati : తిరుపతిలో పలు సర్వే నెంబర్లపై రిజిస్ట్రేషన్ నిషేధం ఎత్తివేత

ttd

Tirupati : ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో భూముల రిజిస్ట్రేషన్ వ వాదం సమసిపోయింది. తిరుపతిలో పలు సర్వే నెంబర్లలోని భూముల ఆస్తులపై ఇటీవల విధించిన నిషేదాన్ని రిజిస్ట్రేషన్ శాఖ ఎత్తివేసింది. జరిగిన పొరపాటును గ్రహించిన టీటీడీ మరోసారి రిజిస్ట్రేషన్ శాఖకు లేఖ రాసింది. దేవాదాయ కమిషనర్ హరి జవహర్ లాల్ రిజిస్ట్రేషన్ల శాఖ లేఖకు ఓ లేఖ రాశారు.

అటు స్థానికుల తరపున ప్రత్యేక చొరవ తీసుకొని రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులతో ఎమ్మెల్యే భువన కరుణాకర్ రెడ్డి మాట్లాడారు. దీంతో తిరుపతిలో పలు సర్వే నెంబర్లపై రిజిస్ట్రేషన్ జరగకుండా విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ రిజిస్ట్రేషన్ల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.