Bride Corona Drama : ఇష్టం లేని పెళ్లి..తనకు కరోనా ఉందని పెళ్లి కుమార్తె డ్రామా

ఆమెకు పెళ్లి ఇష్టం లేదు. ఎలాగైనా పెళ్లి నుంచి తప్పించుకోవాలనుకుంది. దాని కోసం కరోనా అస్త్రాన్ని బయటకు తీసింది. కరోనా ఉందని బాంబు పేల్చింది.

Bride Corona Drama : ఇష్టం లేని పెళ్లి..తనకు కరోనా ఉందని పెళ్లి కుమార్తె డ్రామా

Bride Corona Drama

The bride who played the Corona drama : ఆమెకు పెళ్లి ఇష్టం లేదు. ఎలాగైనా పెళ్లి నుంచి తప్పించుకోవాలనుకుంది. దాని కోసం ఏ ప్లాన్ వేయాలో అర్థం కాలేదు. లవర్ ఉన్నాడని నాటకం ఆడుదామనుకున్నా పెళ్లి కొడుకు తరపు వారు వినిపించుకునేలా కనిపించలేదు. అంతే కరోనా అస్త్రాన్ని బయటకు తీసింది. కరోనా ఉందని బాంబు పేల్చింది. ఈ ఘటన అనంతపురం జిల్లా కదిరిలో జరిగింది.

పెళ్లి కూతురు కరోనా ఉందని చెప్పడంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. అయితే ఆమెకు కరోనా లేదని తెలుసుకుని అంతా ఊపిరి పీల్చుకున్నారు. కదిరి లక్ష్మీ నరసింహ ఆలయంలో ఇవాళ జరగాల్సిన ఓ వివాహం పెళ్లి కుమార్తె డ్రామాతో నలిచిపోయింది. ధర్మవరం పట్టాణానికి చెందిన ఓ యువకునికి ముదిగుబ్బ మండల కేంద్రానికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది.

ఇరువైపుల పెళ్లి పత్రికలను బంధువులందరికీ పంచి పెట్టారు. కదిరిలోని నర్సింహుని సన్నిధిలో ఇవాళ పెళ్లి జరగాల్సివుంది. ఇరువైపుల పెళ్లి కుటుంబ సభ్యులు, బంధువులు ఆలయానికి చేరుకున్నారు.
ఈ లోగా పెళ్లి కుమార్తె తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పింది. అయితే ఆమె మాటను ఎవరూ పట్టించుకోలేదు. పైగా పెళ్లి చేయడానికి సిద్ధమయ్యారు. పెళ్లి కొడుకును, కుమార్తెను పెళ్లి బట్టలతో రెడీ చేశారు.

పెళ్లి కూతురును మండపంలోనికి తీసుకొచ్చారు. ఇంతలోనే ఆమె బాంబు పేల్చింది. కరోనా ఉందని అక్కడున్నవారికి చెప్పింది. అంతే అక్కడున్న వారికి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయింది. పెళ్లి కూతురు కరోనా వార్తతో కంగారు పడ్డ పెళ్లి కొడుకు వారికి అసలు విషయం తర్వాత తెలిసింది. వివాహం ఇష్టం లేకనే ఆమె కోవిడ్ సినిమా చూపించదని అర్థమైంది.

దీంతో కరోనా నాటకం పోలీసుల దగ్గరకు వెళ్లింది. అసలు విషయం బయటి పెట్టింది పెళ్లి కూతురు. తనకు పెళ్లి ఇష్టం లేదని..అబ్బాయి ఐటీఐ చదివి ఎంటెక్ అని అబద్ధం చెప్పాడని, తాను బీటెక్ చదివానని మనసులో మాట చెప్పింది.

దీనికి తోడు తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని పెళ్లి వాయివా వేసుకుందామని చెప్పినా బలవంతంగా తాళి కడతానని బెదిరిస్తున్నాడని కదిరి పట్టణ ఎస్ఐ మహ్మద్ రఫీ ఎదుట వాపోయింది. అయితే పోలీసులకు మాత్రం ఆమె రిపోర్టు చూపించలేదు.

ఇక పెళ్లి ఇష్టం లేదని ముందే ఎందుకు చెప్పలేదని, తమకు అవమానంగా ఉందని పెళ్లి కుమారుడితోపాటు అతని తరపు బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లి కోసం ముందుగానే మూడు లక్షల రూపాయలు పెళ్లి కుమార్తె బ్యాంకు ఖాతాకు ఫోన్ పే ద్వారా జమ చేశానని ఆ డబ్బులిస్తే తన దారిన తాను పోతానని ఆ యువకుడు తేల్చి చెప్పాడు.

ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం కరెక్టు కాదని, పెళ్లి కోసం ఇచ్చిన డబ్బును స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకుని పరిష్కరించుకోవాలని కదిరి ఎస్ఐ చెప్పడంతో చివరికి ఎవరి దారిని వారు వెళ్లిపోయారు. ఇలా కరోనా పెళ్లి నాటకం సమాప్తం అయింది.