Pawan Kalyan: విశాఖలో మంత్రులపై దాడి కేసు.. జనసేన నేతలకు బెయిల్.. హర్షం వ్యక్తం చేసిన పవన్

విశాఖ పట్నం ఎయిర్‌పోర్టు వద్ద ఏపీ మంత్రులపై దాడి చేశారనే అభియోగాలపై అరెస్టైన తొమ్మిది మంది జనసేన నేతలకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు నిర్ణయంపై జనసేన అధినేత హర్షం వ్యక్తం చేశారు.

Pawan Kalyan: విశాఖలో మంత్రులపై దాడి కేసు.. జనసేన నేతలకు బెయిల్.. హర్షం వ్యక్తం చేసిన పవన్

Pawan Kalyan: ఇటీవల పవన్ పర్యటన సందర్భంగా విశాఖ పట్నంలో మంత్రులపై దాడి కేసులో అరెస్టైన జనసేన కార్యకర్తలకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తొమ్మిది మంది నిందితుల బెయిల్ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది.

Swamy Goud: కమలానికి షాక్.. బీజేపీకి మరో నేత గుడ్‌బై.. టీఆర్ఎస్‌లో చేరనున్న స్వామి గౌడ్!

విశాఖ ఎయిర్‌పోర్టుకు వెళ్తున్న మంత్రులపై జనసేన కార్యకర్తలు దాడి చేశారంటూ అక్కడి పోలీసులు వంద మందికిపైగా కార్యకర్తలను అరెస్టు చేశారు. వీరిలో తొమ్మిది మంది మినహా మిగిలిన నిందితులు బెయిల్‌పై విడుదలయ్యారు. 9 మందిపై తీవ్ర అభియోగాలు ఉండటంతో స్థానిక కోర్టు వారికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీనిపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు నిందితులకు బెయిల్ మంజూరు చేసింది. అలాగే ఈ కేసులో నిందితులుగా ఉన్న జనసేన ప్రధాన కార్యదర్శి టి.శివ శంకర్, బొలిశెట్టి సత్యనారాయణ, పార్టీ డాక్టర్స్ సెల్ ఛైర్మన్ డా.రఘును కూడా అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. తమ పార్టీ నేతల విడుదలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.

Sabitha Indra Reddy: చిన్నారిపై లైంగిక దాడి.. స్కూలు గుర్తింపు రద్దు.. ఆదేశాలు జారీ చేసిన మంత్రి!

కార్యకర్తల్ని విడుదల చేస్తూ ఆదేశించిన ‘‘గౌరవ హైకోర్టుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు’’ అంటూ పవన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం తమ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిందని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న నేతలు.. హైకోర్టు అధికారిక ఉత్తర్వులు అందగానే జైలు నుంచి విడుదలవుతారు.