Iconic Bridge On Krishna River : ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణానదిపై రూ.1000 కోట్లతో ఐకానిక్‌ వంతెన నిర్మాణానికి కేంద్రం ఆమోదం

ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణనదిపై సుమారు రూ. 1000 కోట్లతో ఐకానిక్‌ వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తొలిసారిగా దేశంలో కేబుల్‌, సస్పెన్షన్‌ ఐకానిక్‌ వంతెన నిర్మాణం చేపట్టనున్నారు.

Iconic Bridge On Krishna River : ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణానదిపై రూ.1000 కోట్లతో ఐకానిక్‌ వంతెన నిర్మాణానికి కేంద్రం ఆమోదం

iconic bridge On the Krishna river

Iconic Bridge On Krishna River : ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణనదిపై సుమారు రూ. 1000 కోట్లతో ఐకానిక్‌ వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తొలిసారిగా దేశంలో కేబుల్‌, సస్పెన్షన్‌ ఐకానిక్‌ వంతెన నిర్మాణం చేపట్టనున్నారు. రూ. 1082.56 కోట్లతో 30 నెలల్లోనే నిర్మాణం పూర్తి చేయనున్నట్లు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు.

ట్విట్టర్‌ ద్వారా వివరాలను కేంద్ర మంత్రి గడ్కరీ బయటపెట్టారు. ఐకానిక్‌ వంతెన నిర్మాణం ఎలా ఉంటుందో రూపురేఖల ఫోటోలను కూడా ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ఈ వంతెన నిర్మాణం పూర్తి అయితే ప్రపంచంలో రెండోది, దేశంలో తొలి చారిత్రాత్మక వంతెనగా రికార్డుల్లోకి ఎక్కనున్నట్లు గడ్కరీ పేర్కొన్నారు.

Power Cuts For Telugu States : తెలుగు రాష్ట్రాలకు కరెంట్ కట్? కేంద్రం ఆంక్షలతో ఏపీ, తెలంగాణకు పొంచి ఉన్న విద్యుత్ గండం?

ఈ వంతెన నిర్మాణంలో పాదచారుల నడక మార్గాన్ని గాజుతో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. వంతెనలో గోపురం ఆకారంలో పైలాన్‌, నావిగేషనల్‌ స్పాట్‌తో పాటు అనేక సౌకర్యాలు ఉంటాయని తెలిపారు. ఆకర్షణీయంగా తీర్చిదిద్ది దానికి ప్రత్యేకమైన లైటింగ్‌ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ వంతెన నిర్మాణం పూర్తైతే హైదరాబాద్, తిరుపతి మధ్య 80కి.మీ. దూరం తగ్గనుంది.

ఈ వంతెన నిర్మాణంలో అందమైన పరిసరాలు, శ్రీశైలం ప్రాజక్టు, నల్లమల అడవులు, ఎత్తైన పర్వతాలతో భారీ పర్యాటక సామర్థ్యం కలిగి ఉన్నాయని గడ్కరీ పేర్కొన్నారు. తెలంగాణ వైపు లలిత సోమెశ్వర స్వామి ఆలయం, ఆంధ్రప్రదేశ్ వైపు సంగమేశ్వరం ఆలయం ఆకర్షణీయమైన దృశ్యాన్ని కలిగి ఉంటుందని తెలిపారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.