కడప స్టీల్‌ ప్లాంట్ కు గ్రీన్‌సిగ్నల్‌..

కడపలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న స్టీల్‌ ప్లాంట్‌కు ముందుడుగు పడింది. స్టీల్ ప్లాంట్‌ ఏర్పాటు చేయడానికి పర్యావరణ అనుమతులు మంజూరు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

కడప స్టీల్‌ ప్లాంట్ కు గ్రీన్‌సిగ్నల్‌..

Kadapa steel plant green signal : కడపలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న స్టీల్‌ ప్లాంట్‌కు ముందుడుగు పడింది. స్టీల్ ప్లాంట్‌ ఏర్పాటు చేయడానికి పర్యావరణ అనుమతులు మంజూరు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఎన్విరాన్‌మెంట్‌ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్‌కు డిసెంబర్‌ 20న రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. మళ్లీ జనవరి 29న కొన్ని సవరణలు చేసి మరోసారి ప్రతిపాదనలు పంపారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలపై ఈఏసీ సమావేశాలు నిర్వహించింది.

గతేడాది డిసెంబర్ 30, 31న ఫిబ్రవరి 10,11న భేటీ అయ్యి చర్చించింది. రాష్ట్రం పంపిన ప్రతిపాదనలపై సంతృప్తి వ్యక్తం చేయడంతో పర్యావరణ అనుమతులు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కడప జిల్లా సున్నపురాళ్లపల్లె, పెద్దనందులూరు స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలి దశలో ఏడాదికి 3 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల స్టీల్ ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

దీంతో పాటు 84.7 మెగావాట్ల విద్యుత్‌ను కూడా ఉత్పత్తి చేయనున్నారు. ప్రాజెక్ట్‌ ఏరియాలోని 33 శాతం అంటూ 484.4 హెక్టార్లలో గ్రీన్‌ బెల్ట్‌ అభివృద్ధి చేయనుంది. ఇందులో భాగంగా 12 లక్షల 10 వేల మొక్కలు నాటనున్నారు.