Chittoor Bus Accident : ధర్మవరం చేరుకున్న చిత్తూరు బస్సు ప్రమాదంలో మృతి చెందిన 8 మంది మృతదేహాలు

ధర్మవరం నుంచి ఓ పెళ్లి బృందం నిశ్చితార్థం కోసం తిరుచానూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అతి వేగంగా దూసుకెళ్లిన ప్రైవేట్‌ బస్సు బాకరాపేట ఘాట్‌రోడ్డులో అదుపుతప్పి లోయలో పడింది.

Chittoor Bus Accident : ధర్మవరం చేరుకున్న చిత్తూరు బస్సు ప్రమాదంలో మృతి చెందిన 8 మంది మృతదేహాలు

Dharmavaram

Chittoor Bus Accident : చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం బాకరాపేట ఘాట్‌రోడ్డులో బస్సు లోయలోపడి ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలు స్వస్థలానికి చేరుకోనున్నాయి. ప్రమాదం జరిగిన చిత్తూరు జిల్లా నుంచి అనంతపురం జిల్లా ధర్మవరానికి మృతదేహాలను అధికారులు తరలించారు. దర్మవరం పట్టణంలోని ఉషోదయ సర్కిల్ వద్దకు మృతదేహాలు చేరుకున్నాయి.

మృతదేహాలను చూసి బందువులు, స్నేహితులు కన్నీరుమున్నీరవుతున్నారు. టీడీపీ యువ నాయకుడు పరిటాల శ్రీరామ్.. మృతదేహాలను సందర్శించి వారి కుటుంబ సభ్యులకు సాగుభూతి తెలుపనున్నారు. కొద్దిసేపు బంధువులు, స్నేహితుల సందర్శనార్థం ఉషోదయ సర్కిల్‌లో కొంత సేపు ఉంచుతారు. ఆ తర్వాత చిగిచెర్లకు తరలించి అంత్యక్రియలు నిర్వహిస్తారు.

Chittoor Road Accident : చిత్తూరు జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం.. నిశ్చితార్థ వేడుకకు వెళ్తుండగా యాక్సిడెంట్

అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి.. ఓ పెళ్లి బృందం నిశ్చితార్థం కోసం తిరుచానూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అతి వేగంగా దూసుకెళ్లిన ప్రైవేట్‌ బస్సు.. బాకరాపేట ఘాట్‌రోడ్డులో అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో.. ఘటనా స్థలంలోనే ఏడుగురు మృతి చెందగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు ప్రాణాలు విడిచారు. మరో 33 మందికి గాయాలు అయ్యాయి. బాధితుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. ప్రమాద సమయంలో బస్సులు సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నారు.

చిత్తూరు జిల్లా బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారం అందించనున్నట్లు వెల్లడించారు. బస్సు ప్రమాదం సీఎం జగన్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

PM Modi : చిత్తూరు బస్సు ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు

మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 50 వేలు చెల్లించాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. గాయపడి వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు ఆయన సూచించారు. బాధితులు కోలుకునేంతవరకు అండగా ఉండాలని ఆదేశాలిచ్చారు.