Tirumala Tirupati Devasthanam: ఆ రెండు రోజులు శ్రీవారి ఆలయం మూసివేత.. సర్వదర్శనం భక్తులకే అనుమతి

అక్టోబర్ 25న, నవంబర్ 8 తేదీల్లో తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. ఈనెల 25న సూర్యగ్రహణ, నవంబర్ 8న చంద్రగ్రహణం కారణంగా ఆ రోజుల్లో ఆలయం తలుపులు మూసిఉంచుతారు.

Tirumala Tirupati Devasthanam: ఆ రెండు రోజులు శ్రీవారి ఆలయం మూసివేత.. సర్వదర్శనం భక్తులకే అనుమతి

Tirumala Tirupati Devasthanam

Tirumala Tirupati Devasthanam: అక్టోబర్ 25న, నవంబర్ 8 తేదీల్లో తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. ఈనెల 25న సూర్యగ్రహణ, నవంబర్ 8న చంద్రగ్రహణం కారణంగా ఆ రోజుల్లో ఆలయం తలుపులు మూసిఉంచుతారు. ఈ సందర్భంగా ఆ రెండు రోజులు బ్రేక్ దర్శనం, శ్రీవాణి, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఇతర ఆర్జిత సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. సర్వదర్శనం భక్తులకు మాత్రమే అనుమతిస్తారు.

Elephant Eating Panipuri: పానీపూరిని తెగ లాగించేసిన ఏనుగు.. వీడియో వైరల్.. ఫిదా అవుతున్న నెటిజన్లు

ఈనెల 25న సాయంత్రం 5.11 నుంచి 6.27 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుంది. ఈ కారణంగా ఉదయం 8.11 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. అనంతరం సర్వదర్శనం భక్తులనే అనుమతిస్తారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

నవంబర్ 8న మధ్యాహ్నం 2.39 గంటల నుంచి సాయంత్రం 6.27 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుంది. ఉదయం 8.40 నుంచి రాత్రి 7.20 గంటల వరకూ శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. అనంతరం సర్వదర్శనం భక్తులనే అనుమతిస్తారు.