బంతి కోసం వెళ్లి రెండు ఇళ్ల గోడల మధ్య చిక్కుకున్న బాలిక..నరకం చూసిన చిన్నారి

  • Published By: bheemraj ,Published On : July 23, 2020 / 11:55 PM IST
బంతి కోసం వెళ్లి రెండు ఇళ్ల గోడల మధ్య చిక్కుకున్న బాలిక..నరకం చూసిన చిన్నారి

ఒంగోలులో బంతి కోసం వెళ్లి ఓ బాలిక రెండు ఇళ్ల మధ్య చిక్కుకుంది. ఇందిరమ్మ కాలనీలోని మీనాక్షి అనే చిన్నారి రెండు ఇళ్ల మధ్య చిక్కుకుంది. తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటున్న మీనాక్షి ఓ సందులో బంతి పడటంతో దాన్ని తీసుకోవడానికి వెళ్లి సందులో ఇరుక్కుపోయింది. సందు సన్నగా ఉండటంతో మీనాక్షిని బయటకు తీసుకొచ్చేందుకు స్థానికులు యత్నించినప్పటికీ సాధ్యం కాలేదు.

దీంతో తల్లిదండ్రులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడం వారు అక్కడికి చేరుకున్నారు. తమ దగ్గర ఎక్విప్ మెంట్ తో చిన్నారిని క్షేమంగా బయటకు తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే సందులో ఇరుక్కుపోయిన మీనాక్షి రెండు గంటలపాటు నరకం అనుభవించింది. పసి బిడ్డ కళ్ల ముందే ఏం చేయలేక కుటుంబ సభ్యులతోపాటు స్తానికులు కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఒంగోలు ఇందిరమ్మ కాలనీ మూడో లైన్ లో బంతితో ఆటలాడుకుంటున్న బాలిక రెండు గోడల మధ్య ఉన్న సందులో ఇరుక్కపోయింది. ఆడుకుంటున్న క్రమంలో ఆ రెండు గోడల మధ్యలో బంతి పడటంతో ఆ బంతిని తీసుకొచ్చేందుకు చిన్నారి సందులోకి వెళ్లింది. లోపలికి వెళ్లి బయటకు వస్తున్న క్రమంలో గ్యాప్ లేకపోవడంతో అక్కడే ఇరుక్కుపోయింది. బయటికి రాలేక లోపల కదల్లేని పరిస్థితిలో అక్కడే ఇరుక్కపోవడంతో కేకలు వేసింది.

కేకలు విన్న ఇరుగుపొరుగు వారు బయటికి పరుగులు తీసి చూడటంతో వెంటనే ఇంట్లో వారికి తెలియజేశారు. బయటికి వచ్చిన తల్లిదండ్రులు తమ బిడ్డ పరిస్థితిని చూసి ఆందోళనకు గురై ఇరుగుపొరుగు వారిని ఏకం చేశారు. స్తానికులు బాలికను బయటికి తీసేందుకు దాదాపు గంటపాటు కర్రలతో ప్రయత్నించారు. కానీ విశ్వప్రయత్నం చేసినప్పటికీ బయటికి తేలేని పరిస్థితి ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దృశ్యాలను చూసిన వెంటనే ఫైర్ స్టేషన్ సిబ్బందికి విషయాన్ని తెలియజేశారు.

తమ ఎక్విప్ మెంట్ తో సహా సంఘటనా ఫైర్ సిబ్బంది కర్రలతోపాటు వారి దగ్గరున్న బ్లేడ్ల సహాయంతో వాటిని తీసే ప్రయత్నం చేశారు. విశ్వప్రయత్నం చేసినప్పటికీ కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్వవడంతో రెండు గోడలను పగలగొట్టి బాలికను క్షేమంగా బయటికి తీశారు. చిన్న గాయం కూడా కాకుండా రిస్క్ ఆపరేషన్ చేసిన తీరును స్థానికులు అభినందిస్తున్నారు. ఫైర్ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించిన తీరును స్థానికులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఫైర్ సిబ్బంది సాయం మరువలేవన్నారు.