ఉద్యోగుల వేతన బకాయిలు వడ్డీతో చెల్లించాలి : ఏపీ సర్కార్ కు హైకోర్టు ఆదేశం

  • Published By: bheemraj ,Published On : August 11, 2020 / 10:19 PM IST
ఉద్యోగుల వేతన బకాయిలు వడ్డీతో చెల్లించాలి : ఏపీ సర్కార్ కు హైకోర్టు ఆదేశం

ఉద్యోగుల వేతన బకాయిలు వడ్డీతో చెల్లించాలని ఏపీ సర్కార్ ను హైకోర్టు ఆదేశించింది. కరోనా వైరస్ తో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో ఉద్యోగులు, పెన్షనర్లకు 50 శాతం మాత్రమే చెల్లింపులు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్టు కొట్టివేసింది. విశాఖకు చెందిన రిటైర్డ్ జడ్జి కామేశ్వరి వేసిన పిటిషన్ ను విచారించిన హైకోర్టు… ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది.

మార్చి, ఏప్రిల్ నెలల్లో ఉద్యోగులు, పెన్షనర్లకు బకాయిలు చెల్లించాలని సూచించింది. అలాగే, వేతన బకాయిలను 12 శాతం వడ్డీతో సహా రెండు నెలల్లోపు చెల్లించాలని ఆదేశించింది. కరోనా నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 50 శాతం జీతాలు, పెన్షన్లు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో జీవో జారీ చేసిన విషయం తెలిసిందే.