AP IAS Officers : ఏపీలో ఐదుగురు ఐఏఎస్ లకు జైలు శిక్ష

ఏపీలో ఐదుగురు ఐఏఎస్ అధికారులకు హైకోర్టు జైలు శిక్ష, జరిమానా విధించింది. నెల్లూరు జిల్లా తాళ్ళపాక సాయి బ్రహ్మ అనే మహిళ వద్ద భూమి తీసుకుని నష్టపరిహారం ఇవ్వకపోవడంపై సీరియస్ అయింది.

AP IAS Officers : ఏపీలో ఐదుగురు ఐఏఎస్ లకు జైలు శిక్ష

Ap Ias

High Court sentenced IAS officers : ఆంధ్రప్రదేశ్ లో ఐదుగురు ఐఏఎస్ అధికారులకు హైకోర్టు జైలు శిక్ష, జరిమానా విధించింది. నెల్లూరు జిల్లా తాళ్ళపాక సాయి బ్రహ్మ అనే మహిళ వద్ద భూమి తీసుకుని నష్టపరిహారం ఇవ్వకపోవడంపై హైకోర్టు సీరియస్ అయింది. సదరు మహిళకు నష్టపరిహారం ఇవ్వాలని కోర్టు అదేశించిన తర్వాత కూడా చెల్లింపులు జరుపడంలో జాప్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. IAS అధికారుల జీతాల నుంచి కట్ చేసి నష్ట పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.

రిటైర్డ్ IAS మన్మోహన్ సింగ్ కు నెల రోజులపాటు జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధించారు. అప్పటి నెల్లూరు కలెక్టర్ శేషగిరి బాబుకు రెండు వారాలపాటు జైలు శిక్ష, రూ.1000 జరిమానా పడింది. ఎస్ఎస్.రావత్ కు నెల రోజుల జైలు శిక్ష, రూ.1000 ఫైన్ విధించారు. ముత్యాల రాజుకు రెండు వారాల జైలు శిక్ష, రూ.1000 ఫైన్ పడింది.

మరొక ఐఏఎస్ కు జైలు శిక్ష విధించింది. అయితే శిక్షపై అప్పీల్ చేసుకునేందుకు హైకోర్టు నెల రోజుల గడువు ఇచ్చింది. నెల రోజుల పాటు జైలు శిక్షను న్యాయస్థానం సస్పెండ్ చేసింది.