Lakshmi Parvathi: టీడీపీకి చివరి రోజులు వచ్చేశాయి.. చంద్రబాబు నిస్సహాయ స్థితిలో ఉన్నారు

వైసీపీ మహిళా నేత లక్ష్మీపార్వతి టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. టీడీపీకి చివరి రోజులు వచ్చేశాయని, చంద్రబాబు ముసలివాడైపోయాడని..

Lakshmi Parvathi: టీడీపీకి చివరి రోజులు వచ్చేశాయి.. చంద్రబాబు నిస్సహాయ స్థితిలో ఉన్నారు

Lakshmi Parvathi: వైసీపీ మహిళా నేత లక్ష్మీపార్వతి టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. టీడీపీకి చివరి రోజులు వచ్చేశాయని, చంద్రబాబు ముసలివాడైపోయాడని, కొడుకు ఓ మూలన కూర్చోబెట్టాడంటూ కామెంట్స్ చేశారు. టీడీపీలోని మహిళా నేతలను ఎంతగా అవమానిస్తున్నారో ఆ పార్టీ మహిళ నేతలే చెబుతున్నారని అన్నారు. ఆనాడు లక్ష్మీపార్వతి మొదలుకొని మొన్న రోజా, నేడు దివ్యవాణి వరకు చంద్రబాబు అవమానాలు చేస్తూనే ఉన్నాడని విమర్శించారు. చంద్రబాబు చేతుల్లోకి టీడీపీ వెళ్లాక మహిళలను ఘోరంగా అవమానిస్తూ వస్తున్నారని, మహిళలంతా ఏకమై తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.

Lakshmi Parvathi : ఎన్టీఆర్ ఆత్మతో మాట్లాడాను

తెలుగుదేశం పార్టీ క్యాడర్, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నిస్సహాయ స్థితిలో ఉన్నారని, యాభై వేల మంది వచ్చిన మహానాడు విజయవంతం ఎలా అవుతుందని ఎద్దేవా చేశారు. మా పార్టీ మంత్రులు బస్సు యాత్రకు వెళ్తే లక్షల మంది జనం వస్తున్నారని అన్నారు. నిజంగా టీడీపీకి ప్రజల్లో బలం ఉందని ఆ పార్టీనేతలు భావిస్తే.. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీ చేయాలన్నారు. మీకు బలం పెరిగిందని నమ్మకముంటే టీడీపీ ఎమ్మెల్యేలు మొత్తం రాజీనామాలు చేసి పోటీ చేసి గెలవాలంటూ లక్ష్మీపార్వతి సూచించారు.

Lakshmi Parvathi on Chandrababu: మా అల్లుడి గురించి నేనే చెప్పాలి.. చంద్రబాబు ఎలాంటి వ్యక్తి అంటే..!

సోషల్ మీడియా వచ్చిన తర్వాత మీ ఆటలు సాగవని, అన్ని విషయాలు అందరికీ తెలుస్తున్నాయంటూ చంద్రబాబు, లోకేష్ ను ఉద్దేశించి విమర్శలు చేశారు. లోకేష్ వచ్చాక తెలుగుదేశంలో సంస్కారం మొత్తం మార్చేశాడని, చంద్రబాబు ముసలివాడై పోయాడు.. కొడుకు ఓ మూలన కూర్చోబెట్టాడంటూ విమర్శలు చేశారు. లోకేష్ సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని మహిళలను కించ పరుస్తున్నాడని విమర్శించారు. టీడీపీకి చివరి రోజులు వచ్చేశాయని, ఎన్టీఆర్ పెట్టిన టీడీపీ వేరు, ఇప్పుడున్న టీడీపీ వేరు అని లక్ష్మీపార్వతి అన్నారు.