Snake Bite : కాటేసిన పామును తీసుకొని ఆస్పత్రికి వెళ్లాడు

ఎవరినైనా పాము కరిస్తే భయపడిపోతారు. కానీ ఓ వ్యక్తి చేసిన పనితో అందరూ ఆశ్చర్యపోయారు. కాటేసిన పామును తనతో పాటు తీసుకొని ఆస్పత్రికి వెళ్లాడు.

Snake Bite : కాటేసిన పామును తీసుకొని ఆస్పత్రికి వెళ్లాడు

Snake Bite

snake bite man : ఎవరినైనా పాము కరిస్తే భయపడిపోతారు. పాము కరిచిన ప్రదేశం నుంచి పారిపోతారు. టెన్షన్‌తో ఆస్పత్రికి పరుగులు తీస్తారు. తమ ప్రాణాలను కాపాడుకోవడానికి నానా హడావిడి చేస్తారు. కానీ గుంటూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి చేసిన పనితో అందరూ ఆశ్చర్యపోయారు. కాటేసిన పామును తనతో పాటు తీసుకొని ఆస్పత్రికి వెళ్లాడు.

వీరాంజనేయులు అనే వ్యక్తి సిమెంట్‌ రాళ్ల పరిశ్రమలో ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సిమెంట్‌ బ్రిక్స్‌ను లోడ్ చేసుకునేందుకు ట్రాక్టర్‌తో నందివెలుగుకు వచ్చాడు. బ్రిక్స్‌ను లోడ్ చేస్తుండగా అతన్ని తాచు పాము కరిచింది. వీరాంజనేయులు టెన్షన్ పడకుండా కాటేసిన పామును డబ్బాలో బంధించాడు. తనతో పాటు ఆస్పత్రికి తీసుకొచ్చాడు. దీంతో అక్కడున్న వైద్యులు ఆశ్చర్యపోయారు.

తనను ఏ పాము కాటేసింది అని వైద్యులు అడిగితే చెప్పడం కోసం.. ముందస్తుగా పాము డబ్బాలో బంధించి తీసుకొచ్చానని తెలిపాడు. ప్రస్తుతం వీరాంజనేయులు ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు తెలిపారు. వైద్యం పూర్తి అయిన తర్వాత జన సంచారం లేని చోట పామును వదిలేస్తానని వీరాంజనేయులు చెప్పాడు.