చెట్టుక్కట్టేసి…చితక్కొట్టి….మాయమైన మానవత్వం !

  • Published By: murthy ,Published On : September 4, 2020 / 10:11 AM IST
చెట్టుక్కట్టేసి…చితక్కొట్టి….మాయమైన మానవత్వం !

కడప జిల్లాలో దారుణం జరిగింది. మానవత్వం మంట కలిసి పోతోంది. దానికి ఇటీవల కాలంలో ఎన్నో సంఘటనలు చూస్తున్నాం. ఇలాంటి కోవకు చెందిన సంఘటనే కడప జిల్లా ముద్దనూరు మండలంలో చోటు చేసుకుంది. కర్ణాటక రాష్ట్రంకు చెందిన డ్రైవర్ గా పనిచేసే ఒక వ్యక్తిని దొంగతనం చేశాడనే నెపంతో ట్రాన్స్ పోర్ట్ యజమాని ఆ వ్యక్తిని చెట్టుకు కట్టేసి తన అనుచరులతో విచక్షణారహితంగా కొట్టించాడు.



ఈ సంఘటన అక్కడ ఉన్న స్థానికులకు కంటతడి పెట్టించింది. సదరు డ్రైవర్ తనకు ఏమీ తెలియదని చెబుతున్నా వినకుండా ట్రాన్స్ పోర్ట్ యజమాని చట్టాన్ని ఇలా చేతుల్లోకి తీసుకొని చితకబాదించడం చాలా దారుణం. ఈదాడిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో వైరల్ అయ్యింది.

తాడిపత్రిలోని ట్రాన్స్ పోర్టు యజమాని వద్ద కర్ణాటక రాష్ఠ్రం చిక్ బల్లాపూర్ జిల్లా గుడిబండ ప్రాంతానికి చెందిన గిరీష్ అనే యువకుడు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. లారీ అన్ లోడ్ చేసే సమయంలో సిమెంట్ బస్తాలు తక్కువ రావటంతో వాటిని దొంగతనంగా అమ్ముకున్నావని ఆరోపిస్తూ తన అనుచరులను దాడికి పురమాయించాడు.



kadapa theft 2వారు గిరీష్ ను పక్కనే ఉన్న చెట్టుకు కట్టేసి రబ్బరు పైపుతో విచక్షణా రహితంగా కొట్టారు. సిమెంట్ బస్తాలు తాను దొంగిలించలేదని మొరపెట్టుకుంటున్నా వినకుండా దాడి చేయించటం చూసిన ఇతర సిబ్బంది చలించిపోయారు. ఈవీడియో సోషల్ మీడియాలో వైరల్ అవటంతో డ్రైవర్ తండ్రి గురువారం ముద్దనూరుకు చేరుకుని పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
https://10tv.in/zoom-live-while-having-romance-secretary/
ట్రాన్స్ పోర్టు యజమాని నాదెళ్ల గురునాధ్, నాదెళ్ల గురుదేవ, నాదెళ్ళ గురుప్రసాద్, … కాపలాదారు ఓబులేసుపై కేసు నమోదు చేసినట్లు ఎస్ ఐ శివప్రసాద్ తెలిపారు. బాధితుడు గిరీష్ గుడిబండలో చికిత్స పొందుతున్నాడని.. కేసు విచారించి బాధితుడికి న్యాయం చేస్తామని పోలీసులు చెప్పారు.