Professor’s murder case: ప్రియుడితో కలిసి భార్యే హత్యచేసింది.. ప్రొఫెసర్ మర్డర్ కేసును చేధించిన పోలీసులు

విశాఖపట్టణం జిల్లా పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ప్రొఫెసర్ మర్డర్ కేసును పోలీసులు చేధించారు. కట్టుకున్న భర్తను భార్య మృదుల ప్రియుడు శంకర్ తో కలిసి హత్యచేసినట్లు పోలీసులు తేల్చారు. కేసుకు సంబంధించిన విషయాలను పీఎం పాలెం సీఐ రవికుమార్ వెల్లడించారు.

Professor’s murder case: ప్రియుడితో కలిసి భార్యే హత్యచేసింది.. ప్రొఫెసర్ మర్డర్ కేసును చేధించిన పోలీసులు

Professor’s murder case: విశాఖపట్టణం జిల్లా పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ప్రొఫెసర్ మర్డర్ కేసును పోలీసులు చేధించారు. కట్టుకున్న భర్తను భార్య మృదుల ప్రియుడు శంకర్ తో కలిసి హత్యచేసినట్లు పోలీసులు తేల్చారు. కేసుకు సంబంధించిన విషయాలను పీఎం పాలెం సీఐ రవికుమార్ వెల్లడించారు. ఈనెల 17వ తేదీన మృదుల అనే మహిళ తన భర్త మిస్సింగ్ అయినట్లు మా వద్దకు వచ్చిందని అన్నారు. ఆమె భర్త మురళి ఈస్ట్ ఆఫ్రికాలోని ఇరిట్రియా ఇనిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో గత ఎనిమిది ఏళ్లుగా  ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడని, ప్రతి యేడాది 60రోజులు సెలవుపై వచ్చేవాడని, అయితే ఈనెల 9న మురళి విశాఖకు వచ్చాడని సీఐ తెలిపారు. విశాఖ నుండి అతని తల్లిదండ్రులను కలవడానికి రెండురోజుల తరువాత అంటే 11వ తేదీన శ్రీకాకుళం వెళ్లాల్సి ఉందని, కానీ, 10వ తేదిన మరళీని హత్య చేశారని సీఐ అన్నారు. ఘటన జరిగిన వారం రోజులకు తన భర్త కనిపించడం లేదని మిస్సింగ్ కేసు పెట్టిందని, విచారణలో మృదుల చెప్పిన మాటల్లో అనుమానం కలగడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని అన్నారు.

Murder Case : భర్తను ఎలా చంపాలి పుస్తక రచయిత్రి…భర్తను హత్య చేసిన కేసులో అరెస్ట్

మృదులను, మృతుడి కుటుంబ సభ్యులను విచారించగా వారి చెప్పిన మాటల్లో పొంతన కనిపించలేదని, దీంతో మృదులపై అనుమానంతో దర్యాప్తు ప్రారంభించామని, ఆమె కాల్ డేటా, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ చాటింగ్ ఆధారంగా దర్యాప్తు చేయగా.. అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయని సీఐ తెలిపారు. 18ఏళ్ల హరి శంకర్ వర్మ అనే యువకుడుతో మృతుడు భార్య మృదుల వివాహేతర సంబంధం పెట్టుకుందని గుర్తించామని అన్నారు. భర్త ప్రతి ఎడాది 60 రోజులు సెలవు మీద వచ్చేవాడని, అలాగే ఈసారి వచ్చాడని, అయితే 60రోజులు నిన్ను వదలి ఉండలేను అని భర్తతో ఉండవద్దని రవిశంకర్ మృదలపై ఒత్తిడి తెచ్చాడని, దీంతో ప్లాన్ ప్రకారం ఇద్దరు కలసి ఇంట్లో ఉన్న కుక్కర్ తో తలపై బలంగా కొట్టి హత్య చేసినట్లు సీఐ అన్నారు. ఈ విషయం ఎక్కడ బయటకు తెలుస్తుందోనని గుట్టుచప్పుడు కాకుండా గోనే సంచిలో కుక్కి మూటగట్టి మారివలస శివారులో పడేశారని, అయితే బాడీ స్మెల్ వస్తుందని 14వ తేదీన పెట్రోల్ పోసి తగలబెట్టారని సీఐ అన్నారు. బాడీ పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టలేని విధంగా మారిపోయిందని తెలిపారు. హత్య కారణమైన భార్య మృదుల తో పాటు, ప్రియుడు హరిశంకర్ వర్మను అదుపులోకి తీసుకున్నామని సీఐ అన్నారు.

Hyderabad Youtuber Suicide: వ్యూయర్స్ పెరగడం లేదని హైదరాబాద్ యూట్యూబర్ ఆత్మహత్య

ఇదిలాఉంటే మృతి చెందిన మురళి తల్లిదండ్రులు మాట్లాడుతూ.. నా కొడుకును ప్లాన్ ప్రకారమే చంపేశారని, నా కొడుకు సంవత్సరంలో ఒకసారి మాత్రమే మా వద్దకు వచ్చేవాడని, ఈసారి అదికూడా జరగలేదని అన్నారు. నా దగ్గరకు వస్తానని 9వ తేదీన చెప్పాడని, అప్పటి నుండి కొడుకు నుండి పోన్ రాలేదని, అనుమానం రావడంతో మిస్సింగ్ కేసు పెట్టమని మృదులకు చెప్పామని అన్నారు. అయిన పెట్టలేదని, ఇంత పని చేస్తుందని మేము అనుకోలేదని కన్నీరుమున్నీరయ్యారు. వారిది పెద్దలు కూదిర్చిన పెళ్ళి అని, వివాహేతర సంబంధం ఉందని మాకు ముందే తెలుసని, ఎన్నిసార్లు హెచ్చరించిన వినలేదని, చివరకు నా అన్నయ్యను చంపేసిందని మృతుడి సోదరుడు అన్నాడు.