Youngster Suicide : తల్లిదండ్రుల వేధింపులు భరించలేక కుమారుడు ఆత్మహత్య

ఈ నేపథ్యంలో తల్లిదండ్రుల వేధింపులు భరించలేక తన రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. తనది ఆత్మహత్య కాదు, తల్లిదండ్రులు చేసిన హత్యగా భావించాలని తరుణ్ వాట్సప్‌ స్టేటస్‌ మెసేజ్‌లో ప్రస్తావించాడు.

Youngster Suicide : తల్లిదండ్రుల వేధింపులు భరించలేక కుమారుడు ఆత్మహత్య

Youngster

Youngster Suicide : చిత్తూరు జిల్లా పుంగనూరులో విషాదకర ఘటన జరిగింది. తల్లిదండ్రుల వేధింపులు తాళలేక కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వాట్సప్‌లో స్టేటస్‌లో మెసేజ్‌ పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. 26 ఏళ్ల తరుణ్‌ అనే యువకుడు జ్యుయల్లరీ వ్యాపారి నాగరాజు తనయుడు. తల్లిదండ్రుల ప్రవర్తనతో తరుణ్‌ ఏడాదికాలంగా తీవ్ర మనస్తాపం చెందాడు.

ఈ నేపథ్యంలో తల్లిదండ్రుల వేధింపులు భరించలేక తన రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. తనది ఆత్మహత్య కాదు, తల్లిదండ్రులు చేసిన హత్యగా భావించాలని తరుణ్ వాట్సప్‌ స్టేటస్‌ మెసేజ్‌లో ప్రస్తావించాడు. పెళ్లి కుదిరిందని, అయితే తల్లిదండ్రులు డబ్బు మోజులో పడి…. రద్దు చేశారని ఆరోపించాడు.

Bank Manager Suicide : వడ్డీ వ్యాపారుల వేధింపులు భరించలేక బ్యాంక్ మేనేజర్‌ ఆత్మహత్య

డబ్బు మోజులో పడి తనను మానసికంగా, శారీరకంగా హింసించారని మెసేజ్ పెట్టాడు. పలుమార్లు తనను కొట్టారని, ఇంటిలోనే బంధించారని మెసేజ్‌లో రాసుకొచ్చాడు. తన తల్లిదండ్రులు మానసికంగా, శారీరకంగా హింసించారని తరుణ్ ఆరోపిస్తూ ఆత్మహత్య చేసుకున్నాడు.