Andhra Pradesh : ఆ మూడు మున్సిపల్ పీఠాలపై ఉత్కంఠ, విజయం ఎవరిని వరిస్తుందో ?

నంబర్ గేమ్ తెరపైకి రావడంతో అక్కడ క్యాంప్‌ పాలిటిక్స్ ప్రారంభమయ్యాయ్‌. అభ్యర్ధులు చేజారకుండా టీడీపీ ముందుగానే జాగ్రత్తపడి గెలిచిన వారిని క్యాంపులకు తరలించింది.

Andhra Pradesh : ఆ మూడు మున్సిపల్ పీఠాలపై ఉత్కంఠ, విజయం ఎవరిని వరిస్తుందో ?

Ysrcp

AP municipal seats : ఏపీలో అన్ని మేయర్‌లు, కార్పోరేషన్లు ఒక ఎత్తు.. ఆ మూడు ఛైర్మన్‌ స్థానాలు ఓ ఎత్తు. రెండు స్థానాల్లో రాష్ట్రమంతా చేతులెత్తేసిన టీడీపీ అధికారం కోసం పోటీ పడుతుంటే.. మరో స్థానంలో వైసీపీ వర్సెస్ వైసీపీ నడుస్తోంది. ఇంతకీ ఆ మూడు స్థానాలేవీ? అక్కడ అధికారం దక్కించుకునేదెవరు? ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ దూసుకెళ్లింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలన్నీ కైవసం చేసుకుంది. ఒక్క అనంతపురం జిల్లా తాడిపత్రి, కడప జిల్లా మైదుకూరు తప్ప అన్ని చోట్లా ఫ్యాన్ గాలి బలంగా వీచింది. ఈ రెండు మున్సిపాలిటీలపైనా వైసీపీ కన్నేసింది.. ఎక్స్ అఫిషియో ఓట్లతో జెండా ఎగరేయాలని భావిస్తోంది. నంబర్ గేమ్ తెరపైకి రావడంతో అక్కడ క్యాంప్‌ పాలిటిక్స్ ప్రారంభమయ్యాయ్‌. అభ్యర్ధులు చేజారకుండా టీడీపీ ముందుగానే జాగ్రత్తపడి గెలిచిన వారిని క్యాంపులకు తరలించింది.

తాడిపత్రి మున్సిపల్‌ పీఠంపై ఉత్కంఠ కొనసాగుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు ఇంకా క్యాంప్‌లోనే ఉన్నారు. రిసార్ట్ నుంచి విక్టరీ సింబల్‌ చూపిస్తున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి, పవన్‌రెడ్డి. ఎట్టిపరిస్థితుల్లోనూ గెలుపు మాదే అంటున్నారు జేసీ ప్రభాకర్‌రెడ్డి. మరోవైపు తాడిపత్రి మున్సిపల్ పీఠం తమ పార్టీకి పెద్ద విషయం కాదన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. రాష్ట్రంలో అన్నీ గెలిచిన తమకు.. తాడిపత్రి ఒకటి రానంతమాత్రన పోయేదేమీ లేదన్నారు. చంద్రబాబులాగా ప్రలోభాలు పెట్టే అవసరం వైసీపీ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.

కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీ రాజకీయం ఉత్కంఠ రేపుతోంది. మైదుకూరులో 24 వార్డులకు ఎన్నికలు నిర్వహించగా టీడీపీ 12, వైఎస్సార్‌సీపీ 11, జనసేన 1 స్థానాలు గెలుచుకున్నాయి. ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యం రాలేదు.. అయితే.. ఈ సీటు తమదేనని ధీమాగా ఉన్న టీడీపీకీ.. సొంత పార్టీ కౌన్సిలర్‌ ఝలక్ ఇచ్చారు. వైసీపీలోకి జంప్‌ అయ్యారు. దీంతో.. ఈ స్థానంలో వైసీపీ పాగా వేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ టీడీపీ అభ్యర్థి మనసు మార్చుకోవడంతో పాటు, జనసేన అభ్యర్థి కూడా ఆ పార్టీకే మద్దతిస్తే మాత్రం.. చైర్మన్‌ను లాటరీ ద్వారా ఎంపిక చేయాల్సి ఉంటుంది.

మరోవైపు.. చీరాలలో వైసీపీ వర్సెస్ వైసీపీ పోరు నడుస్తోంది. హాట్‌ పాలిటిక్స్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన చీరాలలో పుర పోరు మరింత హీట్‌ పెంచింది అధికార వైసీపీలో. 33 వార్డులున్న చీరాలలో ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ వర్గాలు క్యాంప్‌ పాలిటిక్స్‌కు తెరదీశాయి. ఎన్నికలకు ముందు ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు వైసీపీ అధిష్టానం యత్నించింది. కానీ ఫలితం ఇవ్వలేదు. మున్సిపల్ ఛైర్మన్‌ పదవి ఏ వర్గానికి దక్కినా అధిష్టానం నిర్ణయానికి అంతా కట్టుబడి ఉండాల్సిందేనని ఇప్పటికే స్పష్టం చేశారు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. మరి ఈ నంబర్ గేమ్‌లో విజయం ఎవర్ని వరిస్తుందో చూడాలి.