Polavaram Union Govt : పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం భిన్న ప్రకటనలు.. లోక్ సభలో ఒకలా, రాజ్యసభలో మరోలా

పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై కేంద్ర ప్రభుత్వం భిన్న ప్రకటనలు చేసింది. పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై కేంద్రం లోక్ సభలో ఒకలా రాజ్యసభలో మరోలా ప్రకటనలు చేసింది.

Polavaram Union Govt : పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం భిన్న ప్రకటనలు.. లోక్ సభలో ఒకలా, రాజ్యసభలో మరోలా

Polavaram project

Polavaram Union Govt : పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై కేంద్ర ప్రభుత్వం భిన్న ప్రకటనలు చేసింది. పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై కేంద్రం లోక్ సభలో ఒకలా రాజ్యసభలో మరోలా ప్రకటనలు చేసింది. గతవారం లోక్ సభలో పలువురు అడిగిన సభ్యులు అడిగిన ప్రశ్నలకు 41.15 వద్ద నీటి నిల్వ చేస్తామని కేంద్రం వెల్లడించింది. తాజాగా పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్లు అని స్పష్టం చేసింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ప్రశ్నకు కేంద్ర జల శక్తి శాఖ సహాయ మంత్రి విశ్వేశ్వర్ తుడూ సమాధానం ఇచ్చారు.

ఎత్తు తగ్గించాలని తమకు ఎలాంటి సమాచారం లేదని కేంద్రం స్పష్టం చేసింది. 1980 నాటి గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం పూర్తి రిజర్వాయర్ సామర్థ్యం ఎత్తు 45.72 మీటర్లు అని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. కేంద్ర ప్రకటించిన రెండు వేర్వేరు ప్రకటనల్లో అసలు నిజం ఏంటని జనం చర్చించుకుంటున్నారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు అంచనాలపై కూడా రాజ్యసభలో కేంద్రం సమాధానం ఇచ్చింది.

KVP Ramachandra Rao : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే పోలవరం ప్రాజెక్టు దుస్థితికి కారణం : మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు

సవరించిన అంచనాలపై ఒకే కమిటీ రెండు సిఫార్సులు చేసినట్లుగా కేంద్రం పేర్కొంది. పోలవరంలో సవరించిన అంచనాలను కేంద్రం చెల్లిస్తుందా? అని రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల ప్రశ్నించారు. ఇక కనకమేడల ప్రశ్నకు పోలవరం పురోగతి నివేదికను కేంద్రం సభ ముందు ఉంచింది. 2017-18 ధరల ప్రకారం.. ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ.47,725 కోట్లు.

కాగా, 2019లో జల శక్తి శాఖకు వచ్చిన సవరించిన అంచనా వ్యయం 2017-18 ధరల ప్రకారం రూ.55,548 కోట్లుగా సమాధానంలో పేర్కొంది. ఈ అంచనాలను జలశక్తి శాఖ కేతిక సలహా కమిటీ అంగీకరించిందని చెప్పింది. 2020లో రివైజ్డ్ కాస్ట్ కమిటీ ద్వారా అధ్యయనం చేయించగా అంచనా వ్యయం 47,725 కోట్ల రూపాయలుగా ఉంది.