రెండోదశ పంచాయతీ ఎన్నికల్లోనూ వైసీపీదే హవా..

రెండోదశ పంచాయతీ ఎన్నికల్లోనూ వైసీపీదే హవా..

second phase panchayat elections : ఏపీలో రెండో దశ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లోనూ అధికార వైసీపీ హవా కొనసాగింది. రెండోదశ పంచాయతీ ఎన్నికల్లోనూ వైసీపీ స్పష్టమైన మెజారిటీని సాధించింది. అర్ధరాత్రి వరకూ రెండో విడత పోలింగ్‌కు సంబంధించిన కౌంటింగ్ కొనసాగగా.. వైసీపీ మద్దతుదారులు 2వేల 477 స్థానాల్లోనూ.. టీడీపీ మద్దతుదారులు ఐదు వందల స్థానాల్లోనూ గెలుపొందారు.

ఇక మలి విడత పోలింగ్‌లో ఓటర్లు భారీగా పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 81.61శాతం పోలింగ్ నమోదైనట్లు ప్రకటించింది ఎన్నికల కమిషన్. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 86.60 శాతం ఓటింగ్ జరగ్గా.. శ్రీకాకుళం జిల్లాలో అత్యల్పంగా 72.87 శాతం నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.

రెండో విడతలోనూ వైసీపీ అత్యధిక స్థానాలను గెలిచింది. దీంతో విజయవాడ పార్టీ కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు వైసీపీ నేతలు. నాయకులు, కార్యకర్తలు బాణాసంచా పేల్చుతూ సంబరాలు చేసుకున్నారు.