kesineni nani: నా తమ్ముడు చిన్నితో నాకు ఎటువంటి విభేదాలూ లేవు: కేశినేని నాని

తన పార్లమెంటరీ కార్ పాస్ ఫోర్జరీ చేసి వినియోగిస్తున్న వారు ఎవరో త‌నకు తెలియ‌ద‌ని కేశినేని నాని చెప్పారు. బాధ్యతాయుతమైన ఎంపీగా త‌న పాస్ దుర్వినియోగం కాకూడదని ఫిర్యాదు చేశాన‌ని అన్నారు. త‌న పార్లమెంట్ స్టిక్కర్ ఉన్న కారు త‌న కుమార్తె కూడా వాడర‌ని తెలిపారు. తప్పు జరుగుతుందని తెలిసి స్పందించకపోతే ఆ తప్పు త‌నకు వర్తిస్తుందనే పోలీసులకు ఫిర్యాదు చేశాన‌ని అన్నారు.

kesineni nani: నా తమ్ముడు చిన్నితో నాకు ఎటువంటి విభేదాలూ లేవు: కేశినేని నాని

Kesineni Nani

kesineni nani: విజయవాడ ఎంపీ కేశినేని నాని(శ్రీనివాస్‌) తన సోదరుడు శివనాథ్‌ ( చిన్ని) భార్య జానకి లక్ష్మిపై పోలీస్ కేసు పెట్టినట్లు వార్త‌లు వ‌చ్చిన‌ విష‌యం తెలిసిందే. కారుపై తన ఎంపీ స్టిక్కర్ వేసుకుని తిరుగుతున్నార‌ని నాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేశినేని నాని ఇవాళ మీడియాతో మాట్లాడుతూ మ‌రిన్ని వివ‌రాలు తెలిపారు. త‌న‌ తమ్ముడు చిన్ని త‌న‌కు ఎటువంటి రాజకీయ, ఆర్థిక విభేదాలు లేవని చెప్పారు. త‌న‌కు ఒకటే పార్లమెంటరీ వాహన పాస్ ఉందని చెప్పారు. కానీ, త‌న‌ పార్లమెంటరీ వాహన పాసును ఫోర్జరీ చేసి 7 వాహనాలకు ఉపయోగిస్తూ దుర్వినియోగం చేస్తున్నార‌ని త‌న‌ దృష్టికి వచ్చిందని తెలిపారు.

 

త‌న‌ పేరుతో ఇంకా ఎవరికైనా త‌న వాహన పాసులు ఇచ్చారా? అని మే నెలలో లోక్ సభ సెక్రెటరీ జనరల్‌ను అడిగాన‌ని కేశినేని నాని చెప్పారు. అవి ఫోర్జరీ పాసులని లోక్ సభ సెక్రెటరీ జనరల్ త‌న‌కు, హోం శాఖకు సమాచారం ఇచ్చారని తెలిపారు. లోక్ సభ సెక్రెటరీ జనరల్ ఫోర్జరీ పాస్ వ్యవహారాన్ని హోం శాఖ కార్యదర్శికి పంపారని వివ‌రించారు. హోం శాఖ కార్యదర్శి సూచన మేరకు తాను హైదరాబాద్ విజయవాడ పోలీస్ కమిషనర్లకు త‌న పార్లమెంటరి కార్ పాస్ ఫోర్జరీ విష‌యంపై ఫిర్యాదు చేశాన‌ని అన్నారు.

తన పార్లమెంటరీ కార్ పాస్ ఫోర్జరీ చేసి వినియోగిస్తున్న వారు ఎవరో త‌నకు తెలియ‌ద‌ని కేశినేని నాని చెప్పారు. బాధ్యతాయుతమైన ఎంపీగా త‌న పాస్ దుర్వినియోగం కాకూడదని ఫిర్యాదు చేశాన‌ని అన్నారు. త‌న పార్లమెంట్ స్టిక్కర్ ఉన్న కారు త‌న కుమార్తె కూడా వాడర‌ని తెలిపారు. తప్పు జరుగుతుందని తెలిసి స్పందించకపోతే ఆ తప్పు త‌నకు వర్తిస్తుందనే పోలీసులకు ఫిర్యాదు చేశాన‌ని అన్నారు. ఇప్పటి వరకు పోలీసులు ఫోర్జరీ పాస్ కేసుపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో త‌నకు తెలిద‌ని చెప్పారు. పోలీసులు త‌నకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని అన్నారు. టీడీపీ నేత‌, విజ‌య‌వాడ‌ ఎంపీ కేశినేని నానిని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇవాళ‌ మర్యాదపూర్వకంగా క‌లిశారు. పార్లమెంటులో ధరల పెరుగుదల, జీఎస్టీ భారాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ విపక్ష ఎంపీలు చేపట్టిన నిరసనకు రేవంత్ రెడ్డి హాజ‌రుకాలేదు. రాహుల్ గాంధీతో పాటు నిరసనలో టీఆర్ఎస్ ఎంపీలు పాల్గొన‌డం గ‌మ‌నార్హం.

YS Jagan: రామాయపట్నం పోర్టు పనులను ప్రారంభించిన సీఎం జగన్