AP New Governor : ఏపీ కొత్త గవర్నర్ నియామకంపై రాజకీయంగా చర్చ

ఏపీ కొత్త గవర్నర్ నియామకంపై రాజకీయంగా చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వంతో జస్టిస్ అబ్దుల్ నజీర్ ఎలా ఉంటారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బిష్వభూషన్ హరిచందన్ కు వీడ్కోలు కార్యక్రమం జరుగనుంది.

AP New Governor : ఏపీ కొత్త గవర్నర్ నియామకంపై రాజకీయంగా చర్చ

AP new governor

AP New Governor  : ఏపీ కొత్త గవర్నర్ నియామకంపై రాజకీయంగా చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వంతో జస్టిస్ అబ్దుల్ నజీర్ ఎలా ఉంటారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బిష్వభూషన్ హరిచందన్ కు వీడ్కోలు కార్యక్రమం జరుగనుంది. మొదటి నుంచి బిశ్వభూషణ్ రాష్ట్ర ప్రభుత్వంతో సావధాన ధోరణితోనే వెళ్లారనే మాట ఉంది. బిశ్వభూషణ్ హరిచందన్ వివాదాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు కొత్త గవర్నర్ రాకతో ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు ఎదరవుతాయన్న చర్చ జోరందుకుంది.

ఏపీలో రాజకీయ పరిణామాలు రోజు రోజుకు మారిపోతున్నాయి. వచ్చే ఏడాదిలో ఏపీలో సార్వత్రికత ఎన్నికలు జరుగున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గవర్నర్ ను మార్చడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ మార్పు వెనుక ఏదైనా రాజకీయ కోణం ఉండొచ్చని చర్చించుకుంటున్నారు. కొత్త గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ 1958, జనవరి 5న కర్ణాటకలోని మూడబిదరి తాలూక వెలువాయలో జన్మించారు. అక్కడి మహా వీర కళాశాలలో జస్టిస్ అబ్దుల్ నజీర్ బీకమ్ చేశారు.

AP New Governor: ఏపీ నూతన గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్.. ఏపీ సహా 12 రాష్ట్రాలకు నూతన గవర్నర్లు

మంగళూరు కొడియాల్ బేల్ ఎస్డీఎమ్ లా కళాశాలలో న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. 1983 ఫిబ్రవరి 18న కర్ణాటక హైకోర్టులో న్యాయవాదిగా వృత్తిని ప్రారంభించారు. 2003 మే 12న కర్ణాటక హైకోర్టులో అదనపు న్యాయూమర్తిగా నియమితులయ్యారు. 2004, సెప్టెంబర్ 24న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2017 ఫిబ్రవరి 15న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులై ఈ ఏడాది జనవరి 4వ తేదీ వరకు సేవలు అందించారు.

అయోధ్యపై సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పిన ఐదుగురున్న బెంచ్ లో జస్టిస్ నజీర్ కూడా ఒకరు. ఆ తర్వాత త్రిబుల్ తలాక్ కేసును విచారించిన వారిలో జస్టిజ్ నజీర్ ఉన్నారు. న్యాయవ్యవస్థలో విశిష్ట సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం జస్టిస్ నజీర్ ను ఏపీ రాష్ట్ర గవర్నర్ గా నియమించినట్లుగా తెలుస్తోంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ నజీర్ కీలక పాత్ర పోషించారు. ట్రిపుల్ తలాక్, నోట్ల రద్దు కేసుల్లో జస్టిస్ నజీర్ తెరపైకి వచ్చారు. ఆరేళ్ల కాలంలో 450 బెంచులు, 93 తీర్పులు ఇచ్చారు.