CM jagan: మూడేళ్లలో ఎక్కడా కరువులేదు.. దత్తపుత్రుడు అప్పుడెందుకు ప్రశ్నించలేదు..

రైతు చరిత్రను మార్చే విధంగా గొప్ప పథకాలకు శ్రీకారం చుట్టామని, మూడేళ్ల కాలంలో ప్రతి అడుగూ రైతులను ఆదుకునేదిశగా వేశామని ఏపీ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఖరీఫ్‌ పనులు మొదలు కాకమునుపే వైఎస్సార్‌ రైతు భరోసా అందిస్తున్నామని, మీ అందరి చల్లని దీవెనలతో....

CM jagan: మూడేళ్లలో ఎక్కడా కరువులేదు.. దత్తపుత్రుడు అప్పుడెందుకు ప్రశ్నించలేదు..

Ys Jagan

CM jagan: రైతు చరిత్రను మార్చే విధంగా గొప్ప పథకాలకు శ్రీకారం చుట్టామని, మూడేళ్ల కాలంలో ప్రతి అడుగూ రైతులను ఆదుకునేదిశగా వేశామని ఏపీ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఖరీఫ్‌ పనులు మొదలు కాకమునుపే వైఎస్సార్‌ రైతు భరోసా అందిస్తున్నామని, మీ అందరి చల్లని దీవెనలతో మరో మంచి కార్యక్రమానికి గణపవరంలో శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉందని జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. వైఎస్సార్‌ రైతు భరోసా కింద 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అర్హత పొందిన 50,10,275 రైతు కుటుంబాలకు తొలి విడతగా రూ.3,758 కోట్ల పెట్టుబడి సాయం ప్రభుత్వం అందించింది. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం గణపవరం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన వేదికపై నుంచి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేశారు.

CM Jagan : నేడు ఏలూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన..రైతు భరోసా నిధులను విడుదల చేయనున్న సీఎం

ఈ సందర్భంగా జరిగిన సభలో సీఎం ప్రసంగించారు. రైతు చరిత్రను మార్చే విధంగా గొప్ప పథకాలకు శ్రీకారం చుట్టామని అన్నారు. ప్రతి యేటా రైతులకు, కౌలు రైతులకు, దేవాలయ భూములు సాగు చేసుకుంటున్న వారికి, ఆర్వోఎఫ్ ఆర్ పట్టాలు ఉన్న వారికి కూడా రైతు భరోసా అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రతీయేటా రూ.7వేల కోట్లు కేవలం రైతు భరోసా కిందే అందిస్తున్నామని, గత మూడు సంవత్సరాలుగా ఇది ఇస్తున్నామని, నాలుగో ఏడాది మొదటి విడత కలిపి రూ.23,875 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా కింద ఇచ్చామని జగన్ అన్నారు. రైతుల కష్టాలు తెలిసిన మీ బిడ్డగా ఈ కార్యక్రమం చేస్తున్నామని తెలిపారు. మూడేళ్లలో ఎక్కడా కరువు లేదని, ఒక్కటంటే ఒక్క మండలం కూడా కరువు మండలంగా ప్రకటించాల్సిన అవసరం రాలేదని జగన్ అన్నారు. రాష్ట్రంలో ప్రతి రిజర్వాయర్ కూడా సకాలంలో దేవుడి దయతో నిండుతూ వచ్చాయని, అనంతపురం లాంటి కరువు జిల్లాలో కూడా రికార్డు స్థాయిలోకి భూగర్భ జలాలు పెరిగాయని అన్నారు.

AP CM Jagan: ఎగ్జామ్స్ పేపర్‌ లీక్‌ను సమర్థించిన ప్రతిపక్షాన్ని ఎక్కడైనా చూశారా?

మూడేళ్లలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 16లక్షల టన్నుల మధ్య పెరిగిందని, అంతకుముందు ఐదేళ్ల పాలనలో సగటున 154 లక్షల టన్నులు అయితే, ఈ మూడేళ్ల కాలంలో 170 లక్షల టన్నులకు దిగుబడి పెరిగిందన్నారు. వడ్డీలేని రుణాలకు ఆ ఐదేళ్లలో మొత్తం ఇచ్చింది కేవలం రూ.782 కోట్లు అని, మన మూడేళ్ల కాలంలో ప్రభుత్వం వడ్డీలేని రుణాలకోసమే రూ.1282 కోట్ల కేటాయించామని జగన్ అన్నారు. రైతన్నలపై చంద్రబాబుకు ఉన్న ప్రేమ ఏంటో .. మీ జగనన్నకు ఉన్న ప్రేమ ఏంటో తేడా గుర్తించాలని జగన్ ప్రజలను కోరారు. కౌలు రైతులకు సైతం సీసీఆర్సీ కింద నమోదు చేసుకుంటే వారికి కూడా రూ. 7లక్షల పరిహారం ఇస్తున్నామని, ఇంత పారదర్శకంగా మనం చేస్తున్నామని తెలిపారు.

CM Jagan : సీఎం జగన్ విదేశీ పర్యటన ఖరారు

చంద్రబాబుకు దత్తపుత్రుడైన ఒక పెద్దమనిషి రైతుల పరామర్శకు అని చెప్పి బయల్దేరాడని, ఒక్కడంటే ఒక్క రైతును చూపించలేక పోయాడని అన్నారు. పట్టాదారు పుస్తకం ఉండి, ఆత్మహత్య చేసుకుని, పరిహారం దక్కని కుటుంబాన్ని చూపించలేక పోయాడని అన్నారు. అంతగొప్పగా, పారదర్శకంగా పరిపాలన సాగిస్తున్నామని జగన్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రైతులు అష్టకష్టాలు పడ్డారని, కానీ అప్పుడు ప్రశ్నించకుండా దత్తపుత్రుడు చంద్రబాబు పై అమితమైన ప్రేమను చూపాడని జగన్ విమర్శించారు. ఈ విషయాలపై దత్తపుత్రుడికి అప్పుడు ఎందుకు గుర్తుకు రాలేదంటూ జగన్ ప్రశ్నించారు. ప్రజలంతా ఒక్కటి ఆలోచించాలని, గత ప్రభుత్వం పాలన, మన ప్రభుత్వంలో పాలనను బేరీజు వేసుకోవాలని జగన్ సూచించారు.