Acham naidu: మా జూమ్‌ మీటింగ్‌లోకి దొంగల్లా చొరబడ్డారు.. వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలి

పదవ తరగతి విద్యార్థులతో టీడీపీ నేత నారా లోకేశ్ నిర్వహించిన జూమ్ మీటింగ్‌లోకి వైసీపీ నేతలు వల్లభనేని వంశీ, కొడాలి నానిలతో పాటు మరో ఇద్దరు మధ్యలో ప్రవేశించారు. దీంతో లోకేష్ నాని, వంశీల తీరును తీవ్ర స్థాయిలో తప్పబట్టారు. ఈ విషయంపై టీడీపీ ఏపీ అధ్యక్షులు, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు స్పందించారు.

Acham naidu: మా జూమ్‌ మీటింగ్‌లోకి దొంగల్లా చొరబడ్డారు.. వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలి

Acham Naidu

Acham naidu: పదవ తరగతి విద్యార్థులతో టీడీపీ నేత నారా లోకేశ్ నిర్వహించిన జూమ్ మీటింగ్‌లోకి వైసీపీ నేతలు వల్లభనేని వంశీ, కొడాలి నానిలతో పాటు మరో ఇద్దరు మధ్యలో ప్రవేశించారు. దీంతో లోకేష్ నాని, వంశీల తీరును తీవ్ర స్థాయిలో తప్పబట్టారు. ఈ విషయంపై టీడీపీ ఏపీ అధ్యక్షులు, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు స్పందించారు. మా జూమ్ మీటింగ్‌లోకి వైసీపీ నేతలు దొంగల్లా జొరబడ్డారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జూమ్ కాన్ఫరెన్సులోకి వచ్చిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. సీఎం, వైసీపీ నేతల జీవితాలే ఫేక్ అంటూ ఘాటుగా విమర్శించారు. పిల్లల్ని భయపెట్టి జూమ్ కాన్ఫరెన్సులోకి వైసీపీ వాళ్లు వచ్చారంటూ, మా జూమ్ కాన్ఫరెన్సులోకి రావడం కాదు.. దమ్ముంటే విద్యార్థులతో మంత్రి బొత్స జూమ్ కాన్ఫరెన్స్ పెట్టగలరా అంటూ అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. మంత్రి బొత్స కాన్ఫరెన్స్ పెడితే విద్యార్థులు, తల్లిదండ్రులు జూమ్ లోనే చీపుర్లతో కొడతారు, ముఖాన ఉమ్మేస్తారన్నారు.

Andhra-pradesh : నారా లోకేశ్ మీటింగ్ లో ప్రత్యక్షమైన వైసీపీ నేతలు వల్లభనేని వంశీ..కొడాలి నాని

పదో తరగతి పరీక్షలు నిర్వహించలేని దద్దమ్మలు, పదో తరగతి పాస్ కాని వెధవలు జూమ్ కాన్ఫరెన్సులోకి వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూమ్ కాన్ఫరెన్సులోకి వచ్చిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. 2లక్షల మంది విద్యార్థులు తప్పలేదా..? కొందరు విద్యార్థులు ఆత్మహత్యలు చోసుకోలేదా..? విద్యార్థులకు మనోధైర్యం కల్పించాలని మేం కాన్ఫరెన్స్ పెడితే దొంగల్లా వచ్చి ఇష్టానుసారంగా వ్యవహరిస్తారా అంటూ మండిపడ్డారు. విద్యార్థులు పరీక్షలు తప్పలేదని, ఆత్మహత్యలు చేసుకోలేదంటే మేం క్షమాపణ చెబుతామని అచ్చెన్నాయుడు అన్నారు.