విశాఖలో రెచ్చిపోయిన దొంగలు.. అర్ధరాత్రి జ్యోతిష్యమంటూ వచ్చి లక్షల నగదు, బంగారం ఎత్తుకెళ్లారు

10TV Telugu News

Thieves steal in Visakhapatnam : విశాఖలో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. అర్ధరాత్రి అచ్యుతాపురం మండలం చోడపల్లిలోని సీతారామయ్య అనే వ్యక్తి ఇంట్లోకి చొరబ్డారు. అడ్డుకోబోయిన తండ్రి కొడుకును కర్రలతో చితక్కొట్టారు.

సీతారమయ్య భార్య, కూతురిని తాళ్లతో కట్టేసి 50 తులాల బంగారం, రెండున్నర లక్షల రూపాయలను దోచుకెళ్లారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గాయపడిన తండ్రి కొడుకులను అనకాపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు.సత్యనారాయణ, సీతారామయ్య తండ్రీకొడుకులు జ్యోతిష్యం చెబుతారు. అర్ధరాత్రి సమయంలో జ్యోతిష్యం చెప్పించుకోవడానికి వచ్చామని చెప్పి ఒకరి పేరు ద్వారా రిఫర్ చేసి నలుగురు దుండగులు ఇంట్లోకి ప్రవేశించారు.

ప్రవేశించిన అనంతరమే సత్యనారయణ, ఆయన తల్లిని తాళ్లతో కట్టేసి సీతారామయ్యపై కర్రలతో దాడి చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు క్లూస్ టీమ్ అక్కడికి వెళ్లారు.అయితే చోరీకి వచ్చిన నలుగురు ఎవరు? నిజంగానే జ్యోతిష్యం చెప్పించుకోవడానికే వచ్చారా? సీతారామయ్య, సత్యనారాయణకు తెలిసిన వ్యక్తులా? లేకపోతే బాధితులు కావాలనే చోరీ జరిగినట్లు చెబుతున్నారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.50 తులాల బంగారం, రెండున్నర లక్షల రూపాయల నగదు నిజంగా ఉన్నాయా? అన్న విషయంపై కూడా ఆరా తీస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు దొంగలను పట్టుకునేందుకు గాలిస్తున్నారు.

10TV Telugu News