Cabinet Meet: తెలంగాణలో ఏపీ ప్రజలున్నారని ఆలోచిస్తున్నా -సీఎం జగన్

తెలంగాణ రాష్ట్ర మంత్రులు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. తెలంగాణలో ఏపీ ప్రజలు ఉన్నారని, అందుకనే ఏదైనా మాట్లాడాలంటే ఆలోచిస్తున్నానని అన్నారు.

Cabinet Meet: తెలంగాణలో ఏపీ ప్రజలున్నారని ఆలోచిస్తున్నా -సీఎం జగన్

Cm Jagan

Andhra Pradesh Cabinet: తెలంగాణ రాష్ట్ర మంత్రులు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. తెలంగాణలో ఏపీ ప్రజలు ఉన్నారని, అందుకనే ఏదైనా మాట్లాడాలంటే ఆలోచిస్తున్నానని అన్నారు. మన వాళ్లను ఇబ్బంది పెడతారనే నేను ఎక్కువగా మాట్లాడట్లేదన్నారు. రైతులకు అన్యాయం జరుగుతుంటే మాత్రం ఎలా ఊరుకోవాలి. నీటి విషయంలో ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించాలంటూ మంత్రులకు సూచించారుర. విద్యుత్ విషయంలో మరోసారి కేఆర్ఎంబీకి లేఖ రాయాలని కోరారు.

ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ జలవివాదంపై ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వెయ్యాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర హక్కులకు సంబంధించి రాజీ పడేదిలేదని స్పష్టం చేస్తూ తీర్మానం చేసిన కేబినెట్.. శ్రీశైలం జల విద్యుత్‌ ఉత్పత్తి విషయంలోనూ తెలంగాణ వైఖరిని తప్పుబట్టింది. తెలంగాణ వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని, ప్రధాని మోదీకి లేఖ రాయాలని నిర్ణయించింది.

జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటిలో జులై 8న రైతు దినోత్సవం నిర్వహణపై కూడా చర్చ జరిగింది. పేదలందరికీ ఇళ్లు మెగా గ్రౌండింగ్‌.. జులై 1, 3, 4 తేదీల్లో పెద్దఎత్తున ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు, విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల కొనుగోలుపై రాష్ట్ర కేబినెట్ నిర్ణయాలు తీసుకుంది.