No Mask Fine : మాస్కు లేకుంటే వెయ్యి రూపాయలు జరిమానా, ఏపీలో కొత్త రూల్

కోవిడ్‌ మహమ్మారి మరోసారి దేశవ్యాప్తంగా విజృంభిస్తోంది. పల్లె, పట్నం అనే తేడా లేదు. అన్ని చోట్ల రెచ్చిపోతోంది. దీంతో కొత్త కేసులు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఏపీలోనూ కరోనా తీవ్రత పెరిగింది. రోజూ 300కు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 500కు చేరువలో అంటే 492 మంది కోవిడ్ బారిన పడటం ఆందోళనకు గురి చేస్తోంది.

No Mask Fine : మాస్కు లేకుంటే వెయ్యి రూపాయలు జరిమానా, ఏపీలో కొత్త రూల్

No Mask Fine : కోవిడ్‌ మహమ్మారి మరోసారి దేశవ్యాప్తంగా విజృంభిస్తోంది. పల్లె, పట్నం అనే తేడా లేదు. అన్ని చోట్ల రెచ్చిపోతోంది. దీంతో కొత్త కేసులు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఏపీలోనూ కరోనా తీవ్రత పెరిగింది. రోజూ 300కు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 500కు చేరువలో అంటే 492 మంది కోవిడ్ బారిన పడటం ఆందోళనకు గురి చేస్తోంది.

కరోనా సెకండ్ వేడ్ విజృంభిస్తుందేమోనన్న భయం సర్వత్రా నెలకొంది. దీంతో వైరస్‌ వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. రాష్ట్రవ్యాప్తంగా ‘నో మాస్క్‌.. నో ఎంట్రీ’ విధానాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించింది.

ఈ క్రమంలో నెల్లూరు జిల్లా కలెక్టర్‌ మరో అడుగు ముందుకేసి కీలక నిర్ణయం తీసుకున్నారు. కలెక్టర్ చక్రధర్‌ బాబు ఆదేశాల మేరకు నగరంలో కోవిడ్‌ నియమ నిబంధనలు కఠినంగా అమలు చేయనున్నట్లు కమిషనర్‌ దినేష్‌ తెలిపారు. నగరంలోని పబ్లిక్‌ ప్రదేశాలల్లో మాస్కులు లేకుండా ఎవరు తిరిగినా, ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. మాస్కులు ధరించకుండా తిరిగే వారికి వెయ్యి రూపాయలకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

విద్యా సంస్థల్లో కోవిడ్ కలకలం..
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్‌ మండలం కాతేరులోని ఓ జూనియర్‌ కాలేజీలో ఏకంగా 140 మంది విద్యార్థులకు వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. ఇక్కడ వేలల్లో విద్యార్థులు ఇంటర్‌ చదువుతున్నారు. వీరిలో వందలాది మంది వసతిగృహాల్లో ఉంటున్నారు. వీరికి టెస్ట్‌లు నిర్వహించగా.. సోమవారం(మార్చి 22,2021) ఒక్కరోజే 140 మం దికి వైరస్‌ సోకినట్టు తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు బాధితులను వసతి గృహాల్లోనే ఐసోలేషన్‌లో ఉంచారు. ఇక్కడ పాజిటివ్‌ల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో ఈ ప్రాంతాన్ని కట్టడి(కంటైన్ మెంట్) జోన్‌గా ప్రకటించారు. అలాగే రామచంద్రపురం పట్టణంలో ఎనిమిది మందికి, ముమ్మిడివరం బాలికోన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న ముగ్గురు బాలికలకు పాజిటివ్‌గా తేలింది. రావులపాలెం జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఎనిమిది విద్యార్థికి కొవిడ్‌ సోకింది.

నెల్లూరులో 10 మంది పోలీసులకు పాజిటివ్‌:
నెల్లూరులోని బాలాజీనగర్‌ పోలీసుస్టేషన్‌లో పది మంది సిబ్బందికి కరోనా సోకింది. స్టేషన్‌లో సిబ్బంది పలు ప్రాంతాల్లో బందోబస్తు విధుల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పలువురు సిబ్బందికి జ్వరం, తీవ్ర తలనొప్పి రావడంతో కరోనా పరీక్షలు చేయించుకోగా 10 మందికి కరోనా సోకినట్లు తెలిసింది. దీంతో మిగిలిన వారు కూడా నిర్ధారణ పరీక్షలు చేయించుకునేందుకు సిద్ధమవుతున్నారు.