Banana Chakkarakeli : అరుదైన అరటిగెల… 30కిలోలు.. 140 వరకు పండ్లు.. 

సేంద్రీయ ఎరువుల వాడకంతో నాణ్యమైన పంట ఉత్పత్తులు ఖాయమని మరోసారి రుజువైంది. ఆత్రేయపురం మండలం ఉచ్చిలి గ్రామానికి చెందిన ఆదర్శ రైతు భూపతిరాజు వెంకట సత్యసుబ్బరాజుకు చెందిన అరటి తోటలో తెల్ల చక్రకేళీ గెల మూడున్నర అడుగులు పైగా పెరిగింది.

Banana Chakkarakeli : అరుదైన అరటిగెల… 30కిలోలు.. 140 వరకు పండ్లు.. 

Rare Banana White Chakkarakeli

Rare Banana White Chakkarakeli : సేంద్రీయ ఎరువుల వాడకంతో నాణ్యమైన పంట ఉత్పత్తులు ఖాయమని మరోసారి రుజువైంది. ఆత్రేయపురం మండలం ఉచ్చిలి గ్రామానికి చెందిన ఆదర్శ రైతు భూపతిరాజు వెంకట సత్యసుబ్బరాజుకు చెందిన అరటి తోటలో తెల్ల చక్రకేళీ గెల మూడున్నర అడుగులు పైగా పెరిగింది. ఏకంగా 140 వరకు పండ్లు(30 కిలోలు)తో అబ్బుర పరుస్తోంది. సాధారణంగా రెండున్నర అడుగులు వరకు గెల వేసి, దానికి 60 వరకు పండ్లు(10 కిలోలు) ఉంటాయి.

సేంద్రియ ఎరువుల వినియోగం, సారవంతమైన నేల కావడంతో ఇలా పెద్ద గెలలు వేసి ఎక్కువ కాయల కాయటం అరుదుగా వస్తుంటాయని ఉద్యాన అధికారి అమర్‌నాథ్‌ తెలిపారు.

సేంద్రీయ వ్యవసాయ పద్దతులను పాటించడం ద్వారా ఆరోగ్య కరమైన వాతావరణంలో పంట దిగుబడులను సాధించ వచ్చని ఆయన అంటున్నారు. తోటలో పండిన అరటి పంటను చూసేందుకు అందరూ వస్తుండటంతో రైతు సుబ్బరాజు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.