Tirupati Fire Accident : తిరుపతి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం

క్షతగాత్రులను చికిత్స కోసం సూళ్లూరుపేట ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు.

Tirupati Fire Accident : తిరుపతి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం

fire accident (2)

Three Burnt Alive : ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బాణాసంచా గిడ్డంగిలో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు సజీవ దహనం అయ్యారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వరదయ్యపాలెం మండలం కువ్వాకుల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

క్షతగాత్రులను చికిత్స కోసం సూళ్లూరుపేట ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

Hyderabad Young Woman : ప్రమాదవశాత్తు రైలు కింద పడబోయిన యువతిని రక్షించిన మహిళా కానిస్టేబుల్

అగ్నిప్రమాదం కారణంగా పేలుడు పదార్ధాలకు మంటలు అంటుకొని భారీగా అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. బాణాసంచా గిడ్డంగిలో ఆరుగురు పని చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.