మూడు రాజధానులు..ఏపీకి మంచి జరుగుతుంది : జయప్రకాష్ నారాయణ

  • Published By: madhu ,Published On : December 18, 2019 / 05:15 AM IST
మూడు రాజధానులు..ఏపీకి మంచి జరుగుతుంది : జయప్రకాష్ నారాయణ

మూడు రాజధానుల ప్రతిపాదన ఏపీ రాష్ట్రానికి మంచే జరుగుతుందన్నారు లోక్ సత్త అధినేత జయ ప్రకాష్ నారాయణ. ఏపీకి లాభమేనని తెలిపారు. అధికార వికేంద్రీకరణ జరగడం మంచిదేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీకి మహా నగరం కూడా అవసరమన్నారు.

రాజధానిపై ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ నివేదికనున్న క్రమంలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో..జేపీతో 10tv మాట్లాడింది. రాజధాని విషయం రాష్ట్రానిదే..కేంద్రానికి సంబంధం లేదు. రాష్ట్రానికి బాస్ కేంద్రం కాదు..రాజ్యాంగంలో ఏడో షెడ్యూల్ ప్రకారం రాష్ట్రానిదే తుది నిర్ణయమన్నారు. 

దక్షిణాఫ్రికా మోడల్ రాజధాని ఏపీలో వర్క్ ఔట్ అవుతుందన్నారు. భారతదేశంలో కూడా సౌతాఫ్రికా మోడల్ రాజధానులున్నాయనే విషయాన్ని గుర్తు చేశారాయన. రాజధాని అంటే..అన్నీ ఒకే చోట ఉండాల్సిన అవసరం లేదని, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాన్ని చూడాలని సూచించారు. 

ప్రభుత్వం ఒక చోట, చట్ట సభ ఒకచోట, కోర్టు ఒకచోట ఉండడం తప్పేమి కాదని, శాఖాధిపతుల కార్యాలయాలు ఒకే చోట ఉండాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలు రాజధానికి వెళ్లాల్సిన అవసరం ఉండొద్దన్నారు. కొనుగోలు, అమ్మకాలు, 50 శాతం ఏడు మహానగరాల్లో జరుగుతున్నాయన్నారు జేపీ.

ఒక మహానగరం ఉంటే..ఆ రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయని, అవి లేని రాష్ట్రాలు వెలవెలబోతున్నాయని వెల్లడించారు. జిల్లాల్లో నూటికి 90 శాతం పనులు అయిపోయే విధంగా చూడాలన్నారు. రాజధాని వేరు..మహానగరం వేరు. అమారవతిలో రాజధాని కోసం కేటాయించింది కేవలం రెండు..మూడు ఎకరాలు మాత్రమే ఉంటాయన్నారు జేపీ.
 

Read More : రాజధానుల ప్రకటన రగడ : అమరావతి రైతుల ఆగ్రహం..రోడ్డుపై బైఠాయింపు