విజయనగరం జిల్లాలో తొలిసారి మూడు కరోనా కేసులు..ఏపీలో 1833కి చేరిన పాజిటివ్ కేసులు

  • Published By: venkaiahnaidu ,Published On : May 7, 2020 / 04:15 PM IST
విజయనగరం జిల్లాలో తొలిసారి మూడు కరోనా కేసులు..ఏపీలో 1833కి చేరిన పాజిటివ్ కేసులు

కరోనా వైరస్ మహమ్మారి విజయనగరం జిల్లాకు పాకింది. జిల్లాలో తొలిసారి కరోనా కేసులు నమోదు అయ్యాయి.  గత 24 గంట్లలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఏపీలో మరో 56 కరోనా కొత్త కేసులు నమోదు కాగా, ఇద్దరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1833కి చేరింది. మృతుల సంఖ్య 38కి చేరింది. ఏపీలో 1015 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 780 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 

24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 8087 శాంపిల్స్ పరీక్షించగా 56 కరోనా కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఇందులో విజయనగరం జిల్లాలో కొత్తగా మూడు కేసులు నమోదు అయ్యాయి. కృష్ణా జిల్లాలో 16, గుంటూరు జిల్లాలో 10, కర్నూలు జిల్లాలో 7, విశాఖ జిల్లాలో 7, కడప జిల్లాలో 6, నెల్లూరు జిల్లాలో 4, అనంతపురం జిల్లాలో 3 పాజిటివ్ కేసుల చొప్పున రిజిష్టర్ అయ్యాయి. 24 గంటల్లో కర్నూలు, కృష్ణా జిల్లాల నుంచి ఒకరి చొప్పున మృతి చెందారు. 

రాష్ట్ర వ్యాప్తంగా 51 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. వీరిలో అత్యధికంగా గుంటూరు జిల్లాలో 21 మంది ఉన్నారు. కర్నూలు జిల్లాలో 15, కృష్ణా జిల్లాలో 6, అనంతపురం జిల్లాలో 5, నెల్లూరు జిల్లాలో ముగ్గురు, విశాఖ జిల్లాలో ఒకరు చొప్పున కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుని 780 మంది డిశ్చార్జ్ అయ్యారు.