ఒంగోలు రిమ్స్ ఆస్పత్రి నుంచి ముగ్గురు కరోనా పేషెంట్లు పరారీ

  • Edited By: bheemraj , August 13, 2020 / 06:51 PM IST
ఒంగోలు రిమ్స్ ఆస్పత్రి నుంచి ముగ్గురు కరోనా పేషెంట్లు పరారీ

ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్ ఆస్పత్రి నుంచి ముగ్గురు కరోనా రోగులు పరారయ్యారు. బ్లాక్ నెం.216 నుంచి శ్రీనివాసరావు, నారాయణ రెడ్డి, రామలక్ష్మణరెడ్డి వైద్య సిబ్బంది కళ్లుగప్పి ముగ్గురు రోగులు వెళ్లిపోయారు. పేషెంట్స్ పరారీపై రిమ్స్ సూపరింటెండెంట్ శ్రీరాములు వైద్య అధికారులతో కలిసి చర్చిస్తున్నారు.

ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో మరోసారి వైద్య అధికారుల పర్యవేక్షణ లోపం బయటపడింది. నిన్న కుక్కలు కరోనా పేషెంట్ ను పీక్కుతిన్న సంఘటన తెలిసిందే. తాజాగా రిమ్స్ నుంచి కరోనా పేషెంట్ లు పారిపోవడంతో మరోసారి వైద్య అధికారులు వైఫల్యం బయటపడింది.

ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆస్పత్రి నుంచి పరారైనట్లు అధికారులు గుర్తించారు. వీరికి ట్యాబ్ లెట్స్ ఇస్తున్న సందర్భంగా వారు బెడ్ పై లేకపోవడంతో అధికారులు గుర్తించారు. వెంటనే వారిని ట్రేస్ చేసి శ్రీనివాసరావు, నారాయణ రెడ్డి, రామలక్ష్మణరెడ్డి.. ఈ ముగ్గురు ఎవరు, ఏ వార్డు నుంచి పారిపోయారనే దానిపై దృష్టి సారించారు.

వార్డ్ నెం. 216 లో ఉన్న నారాయణరెడ్డి, రామలక్ష్మణరెడ్డి రాచాల మండంల అక్కిరెడ్డిపాలెంకు చెందిన వారిగా గుర్తించారు. చీమకుర్తికి చెందిన శ్రీనివాసరావును గుర్తించారు. ఈ ముగ్గురు ఎందుకు పారిపోయారనే కోణంలో వీరికి సబంధించిన నెంబర్లను ట్రేస్ చేసి సూపరింటెండెంట్ శ్రీరాములు కాంటాక్టు చేశారు.

కాంటాక్టు చేసిన తర్వాత రాచాలకు చెందిన ఇద్దరు తమకు కరోనా తగ్గింది..తమకు బాగా కావడంతో వెళ్లి పోయామని నిర్లక్ష్యమైన సమాధానం చెప్పారు. అదే విధంగా చీమకుర్తికి చెందిన శ్రీనివాసరావు నుంచి కూడా అదే విధమైన సమాధానం రావడంతో ఒక్కసారిగా అవక్కయ్యారు.