Three Killed : సముద్ర స్నానానికి వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
తిరుపతి గణేష్ తన మేనకోడళ్లు, బంధువులతో కలిసి శనివారం సముద్ర స్నానానికి వెళ్లారు. బీచ్‌లో అలల తాకిడికి ముగ్గురు ఒక్కసారిగా సముద్రంలోకి కొట్టుకుపోయారు.

Died (1)
Three killed : సముద్ర స్నానం ఓ కుటుంబంలో విషాదం నింపింది. కాసేపు సరదాగా గడుపుదామని వెళ్లిన ఆ కుటుంబాన్ని రాకాసి అలలు మింగేశాయి. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం ఎన్.జి.ఆర్‌పురం బీచ్‌లో గల్లంతైన ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి.
మృతులు విశాఖ జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. తిరుపతి గణేష్ తన మేనకోడళ్లు, బంధువులతో కలిసి శనివారం సముద్ర స్నానానికి వెళ్లారు. బీచ్‌లో అలల తాకిడికి ముగ్గురు ఒక్కసారిగా సముద్రంలోకి కొట్టుకుపోయారు.
Tragedy : తుంగభద్ర ఎల్ఎల్ సీ కాలువలో ఈతకు వెళ్లి ముగ్గురు మృతి
దీంతో సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టిన రెస్క్యూ టీమ్ ఇవాళ ముగ్గురి మృతదేహాలను వెలికితీశారు. మృతులు తిరుపతి గణేష్, దీవెన, మానసగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.