Tirupati Zoo Park: తిరుపతి జూ పార్క్‌లో విషాదం.. జంతు ప్రేమికుల ఆవేదన

నాలుగు పులి కూనల్లో తాజాగా ఒకటి మరణించడంతో మిగిలిన మూడు పులి పిల్లలకు జూ వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

Tirupati Zoo Park: తిరుపతి జూ పార్క్‌లో విషాదం.. జంతు ప్రేమికుల ఆవేదన

Tiger Cub (File Photo)

Tiger Cub Passed Away: తిరుపతి జూ పార్క్‌లో విషాదం‌ చోటు చేసుకుంది. తల్లి పులి నుంచి తప్పిపోయి వచ్చిన నాలుగు పులి కూనలను తిరుపతి జూ పార్కుకు తరలించిన విషయం తెలిసిందే. అయితే వాటిల్లో ఒక పులికూన మరణించింది. కిడ్నీ చెడిపోవడంతో పాటు ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ సోకడంతో ఒక పులి పిల్ల మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం ఈ సాయంత్రం చనిపోయిన పులి పిల్లకు జూలోనే దహన సంస్కారాలు నిర్వహించనున్నారు. పులికూన అనారోగ్యం భారినపడినట్లు జూ వైద్యులు ముందుగానే గుర్తించలేక పోవడం పట్ల జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Nandyala Tiger Issue : ముగిసిన ఆపరేషన్ టైగర్.. దొరకని తల్లి పులి జాడ, తిరుపతి జూకి 4 పులి కూనలు

నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం, పెద్దగుమ్మడాపురం అనే గ్రామంలో రెండు నెలల క్రితం నాలుగు పులి కూనలు స్థానికులకు కనిపించాయి. నల్లమల అడవిలో ఆహారం కోసం వచ్చి తల్లి నుంచి తప్పిపోయిన ఈ నాలుగు పులికూనల్ని స్థానికుల సమాచారంతో అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని తల్లి వద్దకు చేర్చటానికి అనేక ప్రయత్నాలు చేశారు. కానీ, ఫలితం దక్కలేదు. దీంతో ఈ నాలుగు పులికూనల్ని తిరుపతి జూకు తరలించగా అక్కడ వాటిని అత్యంత జాగ్రత్తగా సంరక్షిస్తున్నారు. ఈ నాలుగు పులి కూనలు ఆడవేనని జూ వైద్యులు గుర్తించారు.

Nandyala Tiger : తల్లికి దూరమైన పులికూనలకు వేటాడటం నేర్పించునున్న అధికారులు..

ఈ నాలుగు పులి కూనల్లో తాజాగా ఒకటి మరణించడంతో మిగిలిన మూడు పులి పిల్లలకు జూ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మూడు పులి కూనలు ఏమైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాయా? అనే విషయాలను తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు.