TikTok Bhargav : ఆ ఫొటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేసి బాలికను అనుభవించాడు.. టిక్‌టాక్ భార్గవ్ నిజరూపం బయటపెట్టిన పోలీసులు

సంచలనం రేపిన టిక్ టాక్ భార్గవ్ కేసులో పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. ఈ కేసు వివరాలను విశాఖ సిటీ దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్ మీడియాకు వెల్లడించారు. టిక్ టాక్ ద్వారా బాలికను పరిచయం చేసుకున్న భార్గవ్.. టిక్ టాక్ లో స్టార్ చేస్తానని, ఇతర మీడియా చానెల్స్ లో చాన్సులు ఇప్పిస్తానని బాలికకు దగ్గరయ్యాడు. ఈ క్రమంలో ప్రేమిస్తున్నానని ప్రపోజ్ చేశాడు. అయితే ఆ బాలిక నో చెప్పింది. అయినా భార్గవ్ బాలికను వదల్లేదు. వీడియోల పేరుతో దగ్గరయ్యాడు.

TikTok Bhargav : ఆ ఫొటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేసి బాలికను అనుభవించాడు.. టిక్‌టాక్ భార్గవ్ నిజరూపం బయటపెట్టిన పోలీసులు

Tiktok Bhargav

TikTok Bhargav : సంచలనం రేపిన టిక్ టాక్ భార్గవ్ కేసులో పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. ఈ కేసు వివరాలను విశాఖ సిటీ దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్ మీడియాకు వెల్లడించారు. టిక్ టాక్ ద్వారా బాలికను పరిచయం చేసుకున్న భార్గవ్.. టిక్ టాక్ లో స్టార్ చేస్తానని, ఇతర మీడియా చానెల్స్ లో చాన్సులు ఇప్పిస్తానని బాలికకు దగ్గరయ్యాడు. ఈ క్రమంలో ప్రేమిస్తున్నానని ప్రపోజ్ చేశాడు. అయితే ఆ బాలిక నో చెప్పింది. అయినా భార్గవ్ బాలికను వదల్లేదు. వీడియోల పేరుతో దగ్గరయ్యాడు.

ఈ క్రమంలో డ్రెస్ చేంజ్ చేసుకున్నప్పుడు తీసిన ఫొటోలు, వీడియోలు తన దగ్గర ఉన్నాయని బాలికను బ్లాక్ మెయిల్ చేసిన భార్గవ్, శారీరకంగా అనుభవించాడని పోలీసులు తెలిపారు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో భార్గవ్ ని అరెస్ట్ చేశామన్నారు. భార్గవ్ ఫోన్, కారుని కూడా సీజ్ చేశామన్నారు. సోషల్ మీడియా, ఇతర యాప్స్ లో మైనర్ అమ్మాయిలతో ప్రేమ వ్యవహారం చట్టరిత్యా నేరం అని పోలీసులు చెప్పారు. ఇక, ఇలాంటి కేసుల్లో బాధితురాలి పేరు కానీ ఫొటో కానీ బయటకు చెప్పినా చట్టరిత్యా నేరం అని స్పష్టం చేశారు.

టిక్ టాక్ భార్గవ్ కేసులో తవ్వేకొద్ది నిజాలు బయటపడుతున్నాయి. భార్గవ్ వలలో మరికొంతమంది అమ్మాయిలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. చాలామందినే భార్గవ్ మోసం చేసినట్లు తెలుసుకుని.. దిశ పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.

టిక్ టాక్ వీడియోల పేరుతో బాలికపై అత్యాచారం చేసిన కేసులో టిక్ టాక్ ఫేమ్ ఫన్ బకెట్ భార్గవ్ ను విశాఖపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. చెల్లి చెల్లి అని పిలుస్తూనే 14 ఏళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారం చేసినట్టు భార్గవ్ పై బాలిక తల్లి ఆరోపణలు చేసింది. విశాఖపట్నం పోలీస్ స్టేషన్ లో ఈ మేరకు ఆమె ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు ఆధారంగా భార్గవ్ ను పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు.

విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన భార్గవ్.. టిక్ టాక్ తో మంచి పేరు సంపాదించాడు. ఈ క్రమంలోనే విశాఖ జిల్లా సింహగిరి కాలనీకి చెందిన ఓ బాలికతో పరిచయం ఏర్పడింది. టిక్ టాక్ వీడియోలపై ఆ బాలికకూ ఆసక్తి ఉండడంతో తరచూ మాట్లాడుకునేవారు. ఆ పరిచయంతో భార్గవ్ ను అన్నయ్య అని ఆ బాలిక పిలిచేది. చాటింగ్ చేయడంతో పాటు వారిద్దరూ తరచూ కలుసుకునేవారు. చెల్లి అనడంతో భార్గవ్‌తో ఆ బాలిక మరింత స్నేహంగా ఉండేది. అదే అదనుగా భావించిన భార్గవ్ ఆమెకు కబుర్లు చెప్పి నమ్మించాడు. భార్గవ్ మాటలను ఆ బాలిక గుడ్డిగా నమ్మింది. ఇద్దరూ శారీరకంగా దగ్గరయ్యారు. పలుమార్లు కలిశారు. ఆ బాలిక గర్భం దాల్చింది.

ఈ క్రమంలో ఇటీవల బాలికలో వస్తున్న మార్పులను గమనించిన ఆమె తల్లి.. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లింది. దీంతో ఆ బాలిక నాలుగు నెలల గర్భిణి అని తెలిసి షాక్ అయ్యింది. అసలేం జరిగిందని ఆమె అడగ్గా.. జరిగిన విషయాన్ని తన తల్లికి బాలిక వివరించింది. ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. విశాఖ సిటీ దిశ ఏసీపీ ప్రేమ్ కాజల్ ఆధ్వర్యంలో కేసును దర్యాప్తు చేస్తున్నారు. భార్గవ్ ను రిమాండ్ కు తరలించారు. తాను చేసిన తప్పును భార్గవ్ కూడా అంగీకరించినట్టు తెలుస్తోంది.

నాలుగు నెలల గర్భం వచ్చే వరకూ బాలిక తల్లి గుర్తించకపోవడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే.. ఈలోపే భార్గవ్ తనకు అవకాశాలు వచ్చాయని హైదరాబాద్ వెళ్లాడు. కొన్ని ఆడియో ఫంక్షన్స్‌లో స్కిట్లు కూడా చేశాడు. ఎక్కడా పెద్దగా చెప్పుకోదగ్గ అవకాశాలు రాకపోవడంతో మళ్లీ విశాఖ వచ్చి ‘టిక్‌టాక్’ బ్యాన్ కావడంతో వేరే యాప్స్‌లో వీడియోలు చేసుకుంటూ ఉన్న భార్గవ్‌ను బాలిక తల్లి ఫిర్యాదుతో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు భార్గవ్‌పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసిన ‘దిశ’ పోలీసులు అతనిని రిమాండ్‌కు తరలించారు.

టిక్ టాక్ స్టార్ హోదాని భార్గవ్ దుర్వినియోగం చేశాడు. అమాయక యువతులను మోసం చేశాడు. టిక్ టాక్ పై మోజున్న కొందరు అమ్మాయిలు భార్గవ్ ని ఆశ్రయించారు. వారిపై భార్గవ్ కన్నేశాడు. టిక్ టాక్ లో పెద్ద స్టార్ చేస్తానని, పాపులర్ చేస్తానని నమ్మించి మభ్యపెట్టి యువతులను లోబర్చుకున్నాడు. కామంతో కళ్లు మూసుకుపోయిన ఫన్ బకెట్ భార్గవ్.. 14 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ప్రస్తుతం ఆ బాలిక నాలుగు నెలల గర్భవతి కావడంతో ఈ కేసు సంచలనంగా మారింది.