Fun Bucket Bhargav : ఫన్‌ బకెట్‌ భార్గవ్‌ రేప్ కేసు.. ఆ అమ్మాయి నేనూ కాదు, మా అక్కా కాదు.. ప్రూఫ్ ఇదే….

తాజాగా భార్గవ్‌ అత్యాచారానికి పాల్పడింది ఈ అమ్మాయిపైనే అంటూ కొన్ని యూట్యూబ్‌ చానళ్లు భార్గవ్‌తో గతంలో వీడియోలు చేసిన ఇద్దరు అక్కా చెల్లెళ్లు పేర్లను, ఫోటోలనే వాడేస్తున్నారు. వారే జస్విక, మేఘన. దీంతో ఆ ఇద్దరు అక్కచెల్లెళ్లు కంగుతిన్నారు. దీనిపై క్లారిటీ ఇచ్చారు. మీరు అనుకుంటున్న ఆ అమ్మాయి మేము కాదు అంటూ జస్విక, మేఘన తమ తండ్రితో కలిసి ఓ వీడియోను షూట్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ వుతుంది.

Fun Bucket Bhargav : ఫన్‌ బకెట్‌ భార్గవ్‌ రేప్ కేసు.. ఆ అమ్మాయి నేనూ కాదు, మా అక్కా కాదు.. ప్రూఫ్ ఇదే….

Fun Bucket Bhargav

Fun Bucket Bhargav : టిక్ టాక్ ఫన్ బకెట్ ఫేమ్ భార్గవ్ అరెస్ట్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. టిక్ టాక్ లో పాపులర్ చేస్తానని, టీవీ చానల్స్ లో అవకాశం ఇప్పిస్తానని మభ్యపెట్టి మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో పోలీసులు భార్గవ్‌ ను అరెస్ట్ చేశారు. భార్గవ్ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. గతంలో భార్గవ్ తో కలిసి పని చేసిన స్నేహితులు భార్గవ్ గురించి షాకింగ్ విషయాలు చెబుతున్నారు.

భార్గవ్ కు అమ్మాయిలంటే రెస్పక్ట్ లేదని, వాడో పెద్ద ఉమనైజర్ అని తిడుతున్నారు. కెమెరా ముందు ఒకలా, వెనుక మరోలా ఉంటాడని చాలామంది అమ్మాయిలు చెబుతున్నారు. అవకాశాల పేరుతో చాలామంది అమ్మాయిలను మోసం చేశాడనే ఆరోపణలు వస్తున్నాయి. కాగా, రేప్ కేసుకి సంబంధించి భార్గవ్‌ అత్యాచారానికి పాల్పడిన 14 ఏళ్ల బాలిక స్థానంలో ఎందరో పేర్లు బయటకు వస్తున్నాయి.

గతంలో భార్గవ్‌తో కలిసి వీడియోలు చేసిన OMG నిత్య, ‘అమ్మాయి-అబ్బాయి’ ఫేమ్‌ మౌనిక పేర్లు బయటకు వచ్చాయి. వారి ఫొటోలు, వీడియోలు అంతా వాడేస్తున్నారు. దీంతో సదరు యువతులు ఓ వీడియో సందేశం ద్వారా ఆ బాధితురాలిని మేము కాదని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. ఆ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని, అసలు భార్గవ్ తో కాంటాక్ట్ లోనే లేము అని చెప్పుకున్నారు. దయచేసి తమ పేర్లు, ఫొటోలు, వీడియోలు వాడొద్దని విజ్ఞప్తి చేశారు.

తాజాగా భార్గవ్‌ అత్యాచారానికి పాల్పడింది ఈ అమ్మాయిపైనే అంటూ కొన్ని యూట్యూబ్‌ చానళ్లు భార్గవ్‌తో గతంలో వీడియోలు చేసిన ఇద్దరు అక్కా చెల్లెళ్లు పేర్లను, ఫోటోలనే వాడేస్తున్నారు. వారే జస్విక, మేఘన. దీంతో ఆ ఇద్దరు అక్కచెల్లెళ్లు కంగుతిన్నారు. దీనిపై క్లారిటీ ఇచ్చారు. మీరు అనుకుంటున్న ఆ అమ్మాయి మేము కాదు అంటూ జస్విక, మేఘన తమ తండ్రితో కలిసి ఓ వీడియోను షూట్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ వుతుంది.

‘భార్గవ్‌ అన్నయ్య కేసు గురించి మీ అందరికి తెలిసే ఉంటుంది. అందులో ఫీమెల్‌గా ఫస్ట్‌ మా అక్కను, తర్వాత నన్ను అనుకుంటున్నారు. దాని వల్ల చాలా కామెంట్స్‌ వస్తున్నాయి. క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నా. భార్గవ్‌ కేసులో మైనర్‌ వయసు 14 ఏళ్లు. కానీ మా అక్క వయసు 20 ఏళ్లు, నాకు 16 ఏళ్లు. ఈ జూన్‌ వస్తే 17 ఏళ్లు వస్తాయి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగా చాలా మంది మీరు సేఫా? అని మెసేజ్‌లు పెడుతున్నారు. మాకేమి ప్రాబ్లమ్‌ లేదు. మా వీడియోస్ అన్నీ మా డాడీయే చూసుకుంటారు’ అని జస్విక తెలిపింది.

మొత్తానికి భార్గవ్ చేసిన పాడు పనికి.. గతంలో అతడితో కలిసి పని చేసిన అమ్మాయిలు ఎంతోమంది ఇప్పుడు సఫర్ అవుతున్నారు. చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నామని వాపోతున్నారు.. తమ పేర్లు, ఫొటోలను అంతా వాడేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. ఇకనైనా తమ పేర్లు, ఫొటొలు వాడొద్దని వేడుకుంటున్నారు.