Srikalahasti : శ్రీకాళ‌హ‌స్తిలో మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ‌కు చేదు అనుభ‌వం

శ్రీకాళ‌హ‌స్తిలో మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ‌కు చేదు అనుభ‌వం ఎదురైంది. మంత్రి వచ్చారని సాధారణ భక్తుల్ని పట్టించుకోకపోవటంతో భక్తులు మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Srikalahasti : శ్రీకాళ‌హ‌స్తిలో మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ‌కు చేదు అనుభ‌వం

Srikalahasti

Srikalahasti : ప్రజాప్రతినిధులు దేవాలయాలకు వస్తే సాధారణ భక్తులు ఎన్ని అగచాట్లు పడతారో మరోసారి శ్రీకాళహస్తి ఆలయంలో కనిపించింది. మంత్రిగారు వచ్చారని సాధారణ భక్తుల్ని ఆలయ అధికారులు గంటల తరబడి క్యూల్లోనే నిలబెట్టేశారు. దీంతో చిన్నారులతో భక్తులు నానా అగచాట్లు పడ్డారు. దీంతో కొత్తగా దేవాదయ శాఖా మంత్రిగా నియమితులైన కొట్టు స‌త్య‌నారాయ‌ణ‌కు శుక్ర‌వారం (ఏప్రిల్ 15,2022) చేదు అనుభ‌వం ఎదురైంది.

శ్రీ బాలాజీ జిల్లా ప‌రిధిలోని శ్రీకాళ‌హ‌స్తి ఆల‌యం వ‌ద్ద కొత్త దేవాదయ శాఖా మంత్రికి చేదు అనుభవం ఎదురైంది. మంత్రి వచ్చారన సాధారణ భక్తుల్ని మూడు నుంచి ఐదు గంటలపాటు క్యూ లైన్లలోనే నిలిపివేశారు. మంత్రిగారు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని బయటకు వచ్చాక భక్తులంతా మంత్రిపై విరుచుకుపడ్డారు. ఆలయంలోనుంచి బయటకు వచ్చిన మంత్రిని చూడ‌గానే భ‌క్తులంతా ఒక్క‌సారిగా ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా గోబ్యాక్ అంటూ నినాదాలు చేయడంతో మంత్రి షాక్ తిన్నారు.

వ‌రుసగా మూడు రోజులు సెలవులు రావటంతో తిరుమ‌ల‌కు భ‌క్తులు పోటెత్తిన సంగ‌తి తెలిసిందే. తిరుమల వచ్చిన భక్తులు శ్రీకాళ‌హ‌స్తికి భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలో భారీ ర‌ద్దీ నెలకొంది. స్వామి వారి ద‌ర్శ‌నానికి ఏకంగా 4 గంట‌ల‌కు పైగానే స‌మ‌యం ప‌డుతోంది. అయినా భ‌క్తులు క్యూలైన్ల‌లోనే ముందుకు సాగుతున్నారు.

అదే స‌మ‌యంలో మంత్రి హోదాలో కొట్టు స‌త్య‌నారాయ‌ణ అక్క‌డికి వ‌చ్చారు. మంత్రి హోదాలో వ‌చ్చిన ఆయ‌న‌కు ఆల‌య అధికారులు పూర్ణ కుంభంతో స్వాగ‌తం ప‌లికారు. మంత్రి వ‌చ్చిన విష‌యాన్ని గ్ర‌హించిన భ‌క్తులు ఒక్క‌సారిగా నినాదాలు అందుకున్నారు. మంత్రిగారూ గోబ్యాక్ అంటూ నినాదాల‌తో హోరెత్తించారు.