Tirumala : శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్, ఆన్‌లైన్‌లో విడుదల

ఈ నెల 25 ఉదయం 9 గంటలకు టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) విడుదల చేయనుంది. రోజుకు 8 వేల టోకెన్లను భక్తులకు అందుబాటులో ఉంచనుంది. అక్టోబర్ 31వ తేదీ వరకు సర్వదర్శనం టోకెన్లను

Tirumala : శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్, ఆన్‌లైన్‌లో విడుదల

Tirumala

Tirumala : తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే సామాన్య భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. సర్వదర్శనం టోకెన్లు ఇకపై ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేయనుంది. ఈ నెల 25 ఉదయం 9 గంటలకు టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) విడుదల చేయనుంది. రోజుకు 8 వేల టోకెన్లను భక్తులకు అందుబాటులో ఉంచనుంది. అక్టోబర్ 31వ తేదీ వరకు సర్వదర్శనం టోకెన్లను టీటీడీ వెబ్‌సైట్‌లో విడుదల చేయనుంది. భక్తుల భద్రత దృష్ట్యా ఆన్‌లైన్‌ విధానంలో టోకెన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

సర్వదర్శనం టోకెన్ల సంఖ్యను పెంచుతూ ఇటీవలే టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ఇప్పటివరకు చిత్తూరు జిల్లా వారికే పరిమితమైన సర్వదర్శన భాగ్యం ఇకపై అందరికీ కలుగుతుంది. ప్రస్తుతం చిత్తూరు జిల్లా వారికి రోజుకు 2 వేల టికెట్లను టీటీడీ జారీ చేస్తోంది. పెరటాసి నెల కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తే అవకాశం ఉండడంతోనే టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, సర్వదర్శనం టోకెన్లు తీసుకునే భక్తలు ఆధార్ కార్డు తప్పనిసరిగా చూపించాలి.

Tirumala Special Entry Darshan : సెప్టెంబర్ 23న రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల

కాగా, కరోనా వైరస్ కారణంగా.. దర్శనం విషయంలో టీటీడీ పలు నిబంధనలు, ఆంక్షలను విధించింది. కొన్ని రోజులుగా సర్వదర్శనం ఆపేసిన టీటీడీ.. ఇటీవలే దీనిని పునరుద్ధరించింది. ఆన్ లైన్ లో సర్వ దర్శనం టోకెన్లను విడుదల చేయనుంది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తుతుండడంతో పలు నిర్ణయాలు తీసుకుంది.

TTD : శ్రీవారి సర్వదర్శనానికి వెళుతున్నారా, ఆ సర్టిఫికేట్లు తప్పనిసరి!

టోకెన్లు పొంది దర్శనానికి వచ్చే భక్తులు వ్యాక్సిన్‌ 2 డోసులు పూర్తయిన సర్టిఫికెట్‌ తీసుకురావాలని టీటీడీ స్పష్టం చేసింది. వ్యాక్సిన్‌ సర్టిఫికెట్ లేకపోతే కరోనా నెగిటివ్ ధ్రువపత్రం తీసుకురావాలని తెలిపింది. భక్తులు సర్వదర్శనం టోకెన్ల కోసం గుమికూడుతుండటం వల్ల కరోనా వ్యాపించే ప్రమాదం ఉందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్న సర్టిఫికెట్ లేదా దర్శనం సమయానికి మూడు రోజుల ముందు కరోనా పరీక్ష చేయించుకుని తెచ్చుకున్న నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంటుందని ఛైర్మన్ తెలిపారు. కోవిడ్ నియంత్రణ కోసం టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయానికి భక్తులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.