Tirumala Sarva Darshan Tokens : శ్రీవారి భక్తులకు శుభవార్త.. 27న స్లాటెడ్ స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్ల విడుద‌ల

జ‌న‌వ‌రి 2022 నెల‌కు సంబంధించి శ్రీవారి స్లాటెడ్ స‌ర్వ‌ద‌ర్శ‌నం (ఎస్ఎస్‌డీ) టోకెన్ల‌ను డిసెంబ‌ర్ 27న ఉద‌యం 9 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నున్నట్లు టీటీడీ తెలిపింది.

Tirumala Sarva Darshan Tokens : శ్రీవారి భక్తులకు శుభవార్త.. 27న స్లాటెడ్ స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్ల విడుద‌ల

Tirumala

Tirumala Sarva Darshan Tokens : జ‌న‌వ‌రి 2022 నెల‌కు సంబంధించి శ్రీవారి స్లాటెడ్ స‌ర్వ‌ద‌ర్శ‌నం (ఎస్ఎస్‌డీ) టోకెన్ల‌ను డిసెంబ‌ర్ 27న ఉద‌యం 9 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నున్నట్లు టీటీడీ తెలిపింది. రోజుకు 10వేల చొప్పున టోకెన్లను విడుదల చేయనున్నట్లు తెలిపింది. అయితే, వైకుంఠ ఏకాద‌శి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని వేడుకలు జరిగే జ‌న‌వ‌రి 13 నుంచి 22వ తేదీ వ‌ర‌కు రోజుకు 5వేల టోకెన్లను మాత్రమే విడుద‌ల చేస్తామన్నారు. భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి ఆన్ లైన్ లో స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్లు బుక్ చేసుకోవాల్సిందిగా టీటీడీ అధికారులు కోరారు.

మరోవైపు జనవరి నెలకు సంబంధించి శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లను టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయగా, కేవలం గంట వ్యవధిలోనే టికెట్లు అమ్ముడయ్యాయి. జనవరి నెలకు గాను మొత్తం 4.60 లక్షలను ఆన్ లైన్ లో ఉదయం 9 గంటలకు విడుదల చేయగా… కేవలం 60 నిమిషాల్లో భక్తులు టికెట్లను కొనుగోలు చేశారు.

Warm Water : గోరు వెచ్చని నీళ్లు తాగితే మేలే..!

కాగా, దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు కోవిడ్ నెగిటివ్ లేదా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేసింది టీటీడీ. రెండు డోసుల వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకురావాలని భక్తులకు సూచించింది. ఒకవేళ వ్యాక్సిన్ ఇంకా వేయించుకోని నేపథ్యంలో దర్శనానికి 48 గంటల ముందు ఆర్టీపీసీఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికెట్ తీసుకురావాలని భక్తులకు తెలిపింది.

ఈ నిబంధనను టీటీడీ ఇదివరకే తెలియజేసినప్పటికీ.. కొంతమంది భక్తులు ఎలాంటి సర్టిఫికెట్ లేకుండా వచ్చేస్తున్నారని, అలాంటి వారిని అలిపిరి చెక్‌పోస్ట్ దగ్గర అధికారులు ఆపివేస్తారని టీటీడీ తెలిపింది. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లేదా ఆర్టీపీసీఆర్ టెస్ట్ సర్టిఫికెట్ లేనివారిని నిర్ధాక్షిణ్యంగా వెనక్కి పంపుతారని.. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలంది. భక్తుల భద్రత దృష్ట్యా ఈ నియమం అమలు చేయడం జరుగుతోందని… టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి భక్తులు సహకరించాలని టీటీడీ కోరింది.

V-EPIQ Cinema Closed : ఏపీలో టికెట్ రేట్ల ఎఫెక్ట్.. బాహుబలి థియేటర్ మూసివేత

కొవిడ్‌ థర్డ్‌ వేవ్‌ ఒమిక్రాన్‌ రూపంలో దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేశాయని… వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ లేదా ఆర్టీపీసీఆర్‌ పరీక్ష నెగిటివ్‌ సర్టిఫికెట్‌ను అలిపిరి చెక్‌ పాయింట్‌ దగ్గర చూపించిన వారినే తిరుమలకు అనుమతిస్తామని టీటీడీ అధికారులు తేల్చి చేశారు. భక్తులు, ఉద్యోగులు, సిబ్బంది ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని తిరుమలకు వచ్చే భక్తులు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. టీటీడీకి చెందిన ఇతర ఆలయాల్లో కూడా భక్తులు కొవిడ్‌ నిబంధనలు పాటించాలని కోరారు.