Tirumala Srivani Trust : శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ల కోటా డిసెంబర్ 28న విడుదల

తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి దర్శనానికి సంబంధించి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ల జనవరి కోటాను టీటీడీ మంగళవారం విడుదల చెయ్యనుంది.

Tirumala Srivani Trust : తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారి దర్శనానికి సంబంధించి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ల జనవరి కోటాను టీటీడీ మంగళవారం విడుదల చెయ్యనుంది. డిసెంబర్ 28 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేసే టికెట్లలో జనవరి 1న నూతన ఆంగ్ల సంవత్సరం నాడు 1000 బ్రేక్ దర్శన(రూ.500/- లఘు దర్శనం ) టికెట్లు ఆన్‌లైన్‌లో భక్తులకు అందుబాటులో ఉంటాయని తెలిపింది.

జనవరి 13న వైకుంఠ ఏకాదశి నాడు 1000 మహాలఘు దర్శన(రూ.300/-) టికెట్లు ఆన్‌లైన్‌లో భక్తులకు అందుబాటులో ఉంటాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 14 నుండి 22వ తేదీ వరకు 9 రోజుల పాటు రోజుకు 2 వేలు చొప్పున లఘు దర్శన(రూ.500/-) టికెట్లు ఆన్‌లైన్‌లో భక్తులకు అందుబాటులో ఉంటాయి.
Also Read : Drunk And Drive : డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే మీ ఇంట్లో చెపుతారు..మీ బాస్ కూ చెపుతారు
జనవరి, ఫిబ్రవరి నెలల్లో మిగతా రోజుల్లో సోమవారం నుండి శుక్రవారం వరకు రోజుకు 200 చొప్పున, శని, ఆదివారాల్లో 300 చొప్పున బ్రేక్ దర్శన(రూ.500/-) టికెట్లు అందుబాటులో ఉంటాయని టీటీడీ తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు