Tirumala Temple Closed : నేడు చంద్రగ్రహణం.. తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

తిరుమల శ్రీవారి ఆలయం మరోసారి మూతపడింది. మంగళవారం చంద్రగ్రహణం సంభవించనుండటంతో ఆలయాన్ని సుమారు 11 గంటలపాటు మూసివేయనున్నారు. ఇవాళ ఉదయం 8.40 గంటలకు ఆలయాన్ని మూసివేశారు. రాత్రి 7.20 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేయనున్నారు.

Tirumala Temple Closed : నేడు చంద్రగ్రహణం.. తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

tirumala temple closed

Tirumala Temple Closed : తిరుమల శ్రీవారి ఆలయం మరోసారి మూతపడింది. మంగళవారం చంద్రగ్రహణం సంభవించనుండటంతో ఆలయాన్ని సుమారు 11 గంటలపాటు మూసివేయనున్నారు. ఇవాళ ఉదయం 8.40 గంటలకు ఆలయాన్ని మూసివేశారు. రాత్రి 7.20 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేయనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 2.39 నుంచి సాయంత్రం 6.27 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుంది.

ఇటీవలే పాక్షిక సూర్యగ్రహణం కారణంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని మూసివేసిన విషయం తెలిసిందే. చంద్రగ్రహణం కారణంగా వీఐపీ బ్రేక్‌ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఇందులో భాగంగా నేడు ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేసింది.

Vemulawada Rajanna Temple Closed : చంద్రగ్రహణం కారణంగా నేడు వేములవాడ రాజన్న ఆలయం మూసివేత

బ్రేక్‌ దర్శనాలు, ఆర్జితసేవలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను కూడా రద్దు చేసింది. రాత్రి 7.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి.. శుద్ధి చేసిన తర్వాత వైకుంఠం-2 క్యూకాంప్లెక్స్‌ ద్వారా భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించనున్నారు.