Tirumala Tirupati Devasthanams: నూతన సంవత్సరం, వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో దర్శనాల కోసం టీటీడీ ప్రత్యేక చర్యలు

రద్దీ దృష్ట్యా జనవరి 2, 3 తేదీల్లో సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాల కేటాయింపును రద్దు చేశారు. వీఐపీలు స్వయంగా వస్తేనే వైకుంఠ ఏకాదశి, ద్వాదశి నాడు బ్రేక్ దర్శనం కేటాయిస్తారు. 3.5 లక్షల అదనపు లడ్డూలు ముందస్తుగా నిల్వ ఉంచుతున్నారు. కల్యాణ కట్టల్లో భక్తులు తలనీలాలు సమర్పించేందుకు అదనపు క్షురకులను నియమించారు. వైకుంఠద్వార దర్శనం ఉండే పది రోజుల పాటు 24 గంటల పాటు రెండు ఘాట్ రోడ్లు తెరచి ఉంటాయి.

Tirumala Tirupati Devasthanams: నూతన సంవత్సరం, వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో దర్శనాల కోసం టీటీడీ ప్రత్యేక చర్యలు

Tirumala Tirupati Devasthanams: నూతన సంవత్సరం, వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనాల కోసం టీటీడీ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. పూర్తి వివరాలు తెలుపుతూ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఓ ప్రకటన చేశారు. జనవరి 2 నుండి 11వ తేదీ వరకు వైకుంఠద్వార దర్శనం కోసం టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేసింది.

జనవరి 1న మధ్యాహ్నం 2 గంటల నుంచి సర్వదర్శనం టోకన్లను ఇస్తారు. 4.50 లక్షల టోకన్ల కోటా ముగిసే వరకు తిరుపతిలో 9 కేంద్రాల్లో కౌంటర్లు తెరచి ఉంటాయి. భక్తులు సులభంగా కౌంటర్లకు చేరుకునేందుకు వీలుగా పలు ప్రాంతాల్లో క్యూఆర్ కోడ్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆన్ లైన్ లో 2.05 లక్షల రూ.300 దర్శన టిక్కెట్లు, 20 వేల శ్రీవాణి ట్రస్ట్ టిక్కెట్లను భక్తులు బుక్ చేసుకున్నారు.

రద్దీ దృష్ట్యా జనవరి 2, 3 తేదీల్లో సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాల కేటాయింపును రద్దు చేశారు. వీఐపీలు స్వయంగా వస్తేనే వైకుంఠ ఏకాదశి, ద్వాదశి నాడు బ్రేక్ దర్శనం కేటాయిస్తారు. 3.5 లక్షల అదనపు లడ్డూలు ముందస్తుగా నిల్వ ఉంచుతున్నారు. కల్యాణ కట్టల్లో భక్తులు తలనీలాలు సమర్పించేందుకు అదనపు క్షురకులను నియమించారు.

వైకుంఠద్వార దర్శనం ఉండే పది రోజుల పాటు 24 గంటల పాటు రెండు ఘాట్ రోడ్లు తెరచి ఉంటాయి. కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా తిరుమలకు వచ్చే భక్తులు ఫేస్ మాస్క్ ధరించాలి. వ్యక్తిగత నియంత్రణ చర్యలు, శానిటైజేషన్ తప్పనిసరి. 3,500 శ్రీవారి సేవకులతో భక్తులకు సేవలు అందుతాయి. డిసెంబర్ 31, జనవరి 1న తిరుపతిలో సర్వదర్శనం టోకన్లు జారీ రద్దు చేస్తారు. గోవిందమాల భక్తులకు సైతం టోకన్లు, టిక్కెట్టు ఉంటేనే వైకుంఠద్వార దర్శనానికి అనుమతి ఉంటుంది.

Airtel 5G Services in India : దేశవ్యాప్తంగా ఎయిర్‌టెల్ 5G ప్లస్ సర్వీసులు.. నగరాల ఫుల్ లిస్టు ఇదిగో.. ఇండియాలో ధర ఎంత? ఎలా యాక్టివేట్ చేసుకోవాలో తెలుసా?