బ్రహ్మోత్సవం : రథసప్తమి, తిరుమల ముస్తాబు

బ్రహ్మోత్సవం : రథసప్తమి, తిరుమల ముస్తాబు

ratha saptami : రథసప్తమి వేడుకలకు తిరుమల ముస్తాబవుతోంది. సూర్యభగవానుడు మొదటిసారిగా భూమికి దర్శనమిచ్చిన పర్వదినాన రథసప్తమి వేడుకను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సప్తాశ్వ రథంపై సూర్యుడు భూమికి దర్శనమిచ్చిన రోజు కావడంతో ఈ పర్వదినాన్ని ‘రథసప్తమిగా పిలుస్తారని పురాణాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కరోనా వైరస్ ఉన్న దరిమిలా…నిబంధనలు పాటిస్తూ..ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఈ నెల 19వ తేదీన రథసప్తమి వేడుకలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా..శ్రీ మలయప్ప స్వామి వారు ఏడు వాహనాలలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఉదయం 5 గంటల 30 నిమిషాలకు సూర్యప్రభ వాహనం జరుగనుంది. రాత్రి 9 గంటలకు చంద్రప్రభ వాహనంతో వాహనసేవలు ముగుస్తాయి. ఉదయం 5 గంటల 30 నిమిషాల నుంచి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనం, 9 గంటలకు చిన్నశేష వాహనం, 11 గంటలకు గరుడ వాహన సేవ నిర్వహిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటిగంటలకు హనుమంత వాహన సేవ జరుగుతుంది. 2 గంటలకు చక్రస్నానం, సాయంత్రం 4 గంటలకు కల్పవృక్ష వాహనం, 6 గంటలకు సర్వభూపాల వాహన సేవ జరుపుతారు. రాత్రి 08 గంటలకు చంద్రప్రభ వాహనంలో స్వామివారి ఊరేగింపుతో రథసప్తమి బ్రహ్మోత్సవం ముగుస్తుంది.