Tirupati By-Elections : హీటెక్కుతున్న తిరుపతి ఉప పోరు.. వైసీపీ-టీడీపీ మధ్య డైలాగ్‌ వార్‌

తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం పీక్స్‌కు చేరుతోంది. సవాళ్లు, ప్రతిసవాళ్ల మధ్య బైపోల్‌ మినీ సంగ్రామాన్నే తలపిస్తోంది. మూడు ప్రధాన పార్టీల రాజకీయం సరవత్తరంగా మరగా.. అధికార వైసీపీ.. ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య డైలాగ్‌ వార్‌ ముదురుతోంది.

Tirupati By-Elections : హీటెక్కుతున్న తిరుపతి ఉప పోరు.. వైసీపీ-టీడీపీ మధ్య డైలాగ్‌ వార్‌

Tirupati By Elections Dialogue War Between Ycp Tdp

Tirupati by-elections : తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం పీక్స్‌కు చేరుతోంది. సవాళ్లు, ప్రతిసవాళ్ల మధ్య బైపోల్‌ మినీ సంగ్రామాన్నే తలపిస్తోంది. మూడు ప్రధాన పార్టీల రాజకీయం సరవత్తరంగా మరగా.. అధికార వైసీపీ.. ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య డైలాగ్‌ వార్‌ ముదురుతోంది. పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ.. తిరుపతి బైపోల్‌లో ప్రచార పర్వం హీటెక్కుతోంది.

నిన్న, మొన్నటి దాకా ప్రచారం మాత్రమే వినిపించగా.. ఇప్పుడు సవాళ్లు, ప్రతి సవాళ్లకు ఉప ఎన్నిక ప్రచార పర్వం వేదికవుతోంది. కౌంట్‌డౌన్‌ దగ్గరపడుతుండటంతో.. టెంపులు సిటీ రాజకీయాలు విమర్శలు.. వాటికి కౌంటర్లతో మహా రంజుగా మారాయి. ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో.. వైసీపీ, టీడీపీ, బీజేపీ మధ్య డైలాగ్‌ వార్‌ నడుస్తోంది.

బైపోల్‌ ప్రచారంలో.. టీడీపీ చీఫ్ చంద్రబాబు అనూహ్య ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వినిపించిన రాజీనామా అస్త్రాన్ని సంధించారు. గతంలో ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేస్తారా అని అడిగారని.. ఇప్పుడు మేం చేస్తాం. మీకు ఆ దమ్ము ఉందా..? అంటూ చంద్రబాబు సవాల్ చేశారు. 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేకహోదా సాధిస్తానని జగన్ చెప్పారని గుర్తు చేశారు. అందుకే ప్రజలు నమ్మారని.. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఒక్కసారైనా ఆ ప్రస్తావన తెచ్చారా అని చంద్రబాబు ప్రశ్నించారు.

ఇక టీడీపీ చీఫ్ సవాల్‌ చేసిన కొద్ది గంటలకే మంత్రి పెద్దిరెడ్డి రియాక్ట్ అయ్యారు. టీడీపీ అధినేత వ్యాఖ్యలపై.. వైసీపీ నేతలు ధీటుగా స్పందించారు. ఉప ఎన్నికలో ఓడిపోతే వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలంటూ చంద్రబాబు విసిరిన సవాల్‌ను.. అదే రేంజ్‌లో స్వీకరించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మరి పనబాక లక్ష్మి ఓడిపోతే టీడీపీ ఎంపీలు రాజీనామా చేస్తారా..? అని ప్రశ్నించారు. ఇక తిరుపతిలో ముఖ్యమంత్రి జగన్‌ సభ రద్దును రాజకీయం చేయడం తగదన్నారు. కరోనా కారణంగా ప్రజాక్షేమం కోసమే ప్రచారాన్ని రద్దు చేస్తుకున్నారని పెద్దిరెడ్డి పేర్కొన్నారు.

మొత్తంగా.. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య డైలాగ్ వార్‌ హీటెక్కుతోంది. పెద్దిరెడ్డి స‌వాల్‌తో వైసీపీలో జోష్ పెర‌గ్గా.. టీడీపీ ఆత్మర‌క్షణ‌లో ప‌డిన‌ట్లయింది. మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలపై.. చంద్రబాబు, టీడీపీ నేతలు ఎలా రెస్పాండ్‌ అవుతారో చూడాలి మరి.