Tirupati By Elections : బీజేపీ అభ్యర్థి ఫిక్స్, రత్నప్రభ ఎవరు ?

తిరుపతి బై పోల్‌ ఎలక్షన్‌ హీటెక్కుతోంది. ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంతో.. రాజకీయం రంజుగా మారుతోంది. తిరుపతి ఉప ఎన్నికలో.. అభ్యర్థి ఎంపికపై బీజేపీ ఆచితూచి అడుగులేసింది.

Tirupati By Elections : బీజేపీ అభ్యర్థి ఫిక్స్, రత్నప్రభ ఎవరు ?

Tirupati By Elections

తిరుపతి బై పోల్‌ ఎలక్షన్‌ హీటెక్కుతోంది. ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంతో.. రాజకీయం రంజుగా మారుతోంది. తిరుపతి ఉప ఎన్నికలో.. అభ్యర్థి ఎంపికపై బీజేపీ ఆచితూచి అడుగులేసింది. బీజేపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్‌ రత్నప్రభ బరిలోకి దింపింది. ఆమె పేరును బీజేపీ అధిష్టానం ఖరారుచేసింది. ఈ మేరకు ఏపీ బీజేపీ ఇన్‌ఛార్జి సునీల్‌ దియోధర్‌ ట్వీట్‌ చేశారు.

రత్నప్రభ 1958లో హైదరాబాద్‌లో జన్మించారు. ఉన్నత విద్యావంతుల కుటుంబంలో జన్మించిన రత్నప్రభ తండ్రి కత్తి చంద్రయ్య కూడా ఐఎఎస్‌గా పనిచేశారు. తల్లి డాక్టర్‌. భర్త విద్యాసాగర్‌ కూడా ఐఎఎస్‌. 1981 ఐఎఎస్‌ బ్యాచ్‌ కర్నాటక కేడర్‌కు చెందిన రత్నప్రభ..ఆ రాష్ట్రంలోనే ఎక్కువ కాలం పనిచేశారు. మహిళా సాధికారిత, అక్షరాస్యత కోసం ఎంతో పాటుపడ్డారు.

వైఎస్‌ సీఎంగా ఉన్నప్పుడు ఏపీలోనూ సేవలందించారు రత్నప్రభ. తర్వాతకాలంలో మళ్లీ కర్నాటకలోనే పనిచేశారు. 2017లో కర్నాటక చీఫ్‌ సెక్రటరీ అయ్యారు. 2018 జూన్‌లో పదవీ విరమణ పొందారు. ఆ తర్వాత యడియూరప్ప పిలుపుమేరకు 2018లో బీజేపీలో చేరారు. ప్రస్తుతం కర్నాటక స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఛైర్‌ పర్సన్‌గా పనిచేస్తున్నారు.

గత ఏడాది అనారోగ్యంతో తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణించడంతో.. ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. తిరుపతి బరిలో.. అధికార పార్టీ వైసీపీ నుంచి డాక్టర్ గురుమూర్తి, టీడీపీ నుంచి మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి బరిలోకి ఉన్నారు.