Tpt by Poll : ప్రచారానికి పవన్ రెడీ, మూడో తేదీన కవాత్

తిరుపతిలో ప్రచారానికి సిద్ధమయ్యారు జనసేనాని పవన్‌ కల్యాణ్‌. తిరుపతిలో ఆయన పర్యటన ఖరారైంది.

Tpt by Poll : ప్రచారానికి పవన్ రెడీ, మూడో తేదీన కవాత్

Tpt

 Janasena Chief Pawan Kalyan Camping : తిరుపతిలో ప్రచారానికి సిద్ధమయ్యారు జనసేనాని పవన్‌ కల్యాణ్‌. తిరుపతిలో ఆయన పర్యటన ఖరారైంది.2021, ఏప్రిల్ 03వ తేదీన తిరుపతిలో పవన్‌కల్యాణ్ కవాత్ నిర్వహించనున్నారు. బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. తిరుపతిలోని ఎమ్మార్‌పల్లి సర్కిల్‌ నుంచి శంకరంబడి వరకు పవన్ పాదయాత్ర సాగనుంది. మూడో తేదీ మధ్యాహ్నం 3 గంటలకు పాదయాత్ర మొదలవుతుందని జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్‌ వెల్లడించారు.

తిరుపతి ఉప ఎన్నికల్లో పవన్‌ ప్రచారంపై అనేక అపోహలు, అసత్య ప్రచారాలు చేస్తున్నారని మనోహర్‌ ఆరోపించారు. మోదీ నాయకత్వంలో పవన్‌ మంచి నాయకుడిగా ఎదుగుతారని వెల్లడించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తీసుకువచ్చి ప్రజలకు మేలు చేస్తామన్నారు. పవన్ పాదయాత్రలో బీజేపీ, జనసేన నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొంటారన్నారు. తిరుపతి ఉప ఎన్నికలో పవన్‌ రెండు విడతల్లో ప్రచారం చేస్తారన్నారు. తిరుపతి తర్వాత నెల్లూరులో ప్రచారం నిర్వహించనున్నారు జనసేనాని.

ప్రజలను బెదిరించి ఓట్లు పొందాలని చూస్తున్నారంటూ… వైసీపీ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు నాదెండ్ల మనోహర్‌. ప్రజల్లో విశ్వాసం ఉందనుకుంటే… మండలానికో ఎమ్మెల్యే, నియోజకవర్గానికో మంత్రి ఎందుకంటూ ప్రశ్నించారు. ఇతర పార్టీల నేతలను బెదిరించి ఎన్నికలకు వెళ్లడం మంచిది కాదన్నారు నాదెండ్ల మనోహర్‌.

తిరుపతి ఉపఎన్నిక హీట్ పీక్ స్టేజ్ చేరింది. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఎలాగైనా గెలువాలని బీజేపీ… జనసేనాని పవన్‌పై గంపెడాశలు పెట్టుకుంది. తిరుపతిలో ఓట్లు రాలాలంటే… పవన్‌ రావాల్సిన పరిస్థితిని బీజేపీ వ్యూహాత్మకంగా క్రియేట్‌ చేసింది. ప్రధానంగా కాపు ఓట్లపై దృష్టిపెట్టిన బీజేపీ… పవనే తమ సీఎం అభ్యర్థి అంటూ ప్రకటించడం ద్వారా… ప్రచారానికి ఆయన రాక తప్పనిసరి పరిస్థితిని కల్పించింది.

తమ ఓటు బ్యాంకుకు పవన్, జనసేన చరిష్మా కలిస్తే.. ఏపీలో బలమైన శక్తిగా ఎదుగొచ్చన్నది బీజేపీ దీర్ఘకాలిక ప్రణాళిక. ఏపీలో కాపు సామాజిక వర్గం రాజకీయాల్లో బలమైన శక్తిగా ఉంది. పవన్ కల్యాణ్ సీఎం అవుతారనే ఉద్దేశంతో కాపు సామాజిక వర్గం ఓట్ల పోలరైజేషన్ జరిగే అవకాశం ఉంటుంది.