Tirupati By Election Result 2021 : తిరుపతి బై పోల్.. వైసీపీకి 2500 ఓట్ల ఆధిక్యం

తిరుపతి లోక్‌సభ నియోజక వర్గ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. పోస్టల్ బ్యాలెట్‌లో వైఎస్సార్‌సీపీ ఆధిక్యంలో ఉంది. తిరుపతి 13, శ్రీకాళహస్తి 17, సత్యవేడు 14, సర్వేపల్లి 22, గూడూరు 23, వెంకటగిరి 23, సూళ్లూరుపేటలో 25 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి చేశారు.

Tirupati By Election Result 2021 : తిరుపతి బై పోల్.. వైసీపీకి 2500 ఓట్ల ఆధిక్యం

Tirupati By Election Result 2021

Tirupati Election Result 2021 : తిరుపతి లోక్‌సభ నియోజక వర్గ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. పోస్టల్ బ్యాలెట్‌లో వైఎస్సార్‌సీపీ ఆధిక్యంలో ఉంది. వైసీపీ అభ్యర్థి గురుమూర్తి తన సమీప అభ్యర్థి కంటే 2500 ఓట్ల ముందంజలో కొనసాగుతున్నారు. తిరుపతి 13, శ్రీకాళహస్తి 17, సత్యవేడు 14, సర్వేపల్లి 22, గూడూరు 23, వెంకటగిరి 23, సూళ్లూరుపేటలో 25 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి చేశారు.

వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ ఆకస్మిక మృతితో తిరుపతి లోక్‌సభకు ఏప్రిల్ 17న ఉపఎన్నిక జరిగింది. ప్రధాన పార్టీలైన వైసీపీ నుంచి ఎం.గురుమూర్తి, టీడీపీ నుంచి పనబాక లక్ష్మి, బీజేపీ తరఫున కె.రత్నప్రభ, కాంగ్రెస్‌ నుంచి చింతామోహన్‌ బరిలో ఉన్నారు. వీరితో కలిపి మొత్తం 28 మంది అభ్యర్థులు పోటీ చేశారు.

తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో విస్తరించి ఉండటంతో రెండు చోట్ల కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజ కవర్గాల ఓట్ల లెక్కింపు నెల్లూరులోని డీకే గవర్న మెంట్‌ మహిళా కళాశాలలో జరుగుతోంది. చిత్తూరు జిల్లాకు చెందిన తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాలకు సంబంధించి తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఆర్ట్స్‌ కాలేజీలో కౌంటింగ్‌ ఏర్పాట్లు చేశారు.