SI Suspended: కేసు విషయంలో నిర్లక్ష్యం.. తిరుపతి ఎంఆర్ పల్లి ఎస్ఐ సస్పెండ్

దీంతో ఆమె ఈ విషయం ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎస్పీ గిరిబాబును సస్పెండ్ చేస్తు ఆదేశాలు జారీచేశారు. విధి నిర్వహణలో అలసత్వం పనికిరాదని హెచ్చరించారు.

SI Suspended: కేసు విషయంలో నిర్లక్ష్యం.. తిరుపతి ఎంఆర్ పల్లి ఎస్ఐ సస్పెండ్

Si Suspended

SI Suspended: తిరుపతి ఎంఆర్ పల్లి ఎస్ఐ గిరిబాబును ఎస్పీ వెంకట అప్పల నాయుడు సస్పండ్ చేశారు. ఓ కేసు విషయంలో ఎస్ఐ నిర్లక్ష్యంగా వ్యవరించారని ఎస్పీకి ఫిర్యాదు రావడంతో ఎస్ఐని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీచేశారు. ఇక కేసు వివరాల్లోకి వెళితే..ఓ మహిళ తన కూతురి పట్ల ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడని తిరుపతి ఎంఆర్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

అయితే ఆ స్టేషన్ లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న గిరిబాబు మహిళ ఫిర్యాదుపై కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. సదరు మహిళ అనేక సార్లు పోలీస్ స్టేషన్ చుట్టు తిరిగినా పట్టించుకోలేదు.

దీంతో ఆమె ఈ విషయం ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎస్పీ గిరిబాబును సస్పెండ్ చేస్తు ఆదేశాలు జారీచేశారు. విధి నిర్వహణలో అలసత్వం పనికిరాదని హెచ్చరించారు.