Tirupati Padma Murder Case : తిరుపతి పద్మ మర్డర్ కేసు.. విడాకులు ఇవ్వనందుకే చంపేశానన్న భర్త

సంచలనం రేపిన తిరుపతి పద్మ మర్డర్ కేసు విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి. పద్మను చంపడానికి కారణం ఏంటో భర్త వేణగోపాల్ చెప్పాడు.(Tirupati Padma Murder Case)

Tirupati Padma Murder Case : తిరుపతి పద్మ మర్డర్ కేసు.. విడాకులు ఇవ్వనందుకే చంపేశానన్న భర్త

Tirupati Padma Murder Case

Tirupati Padma Murder Case : సంచలనం రేపిన తిరుపతి పద్మ మర్డర్ కేసు విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి. కట్టుకున్న భార్యను తానే అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు భర్త వేణుగోపాల్ పోలీసుల విచారణలో తన నేరాన్ని అంగీకరించాడు. పద్మను చంపడానికి కారణం ఏంటో కూడా అతడు చెప్పాడు. విడాకులు ఇవ్వకుండా టార్చర్ పెడుతోందని, అందుకే పద్మను హత్య చేశానని వేణుగోపాల్ చెప్పాడు.

”కాపురానికి రానని చెప్పింది. దీంతో డైవర్స్ ఇస్తాను, డబ్బులు కూడా ఇస్తానని చెప్పాను. అయితే మరింత డబ్బు కోసం పద్మ ఆశ పడింది. చట్టం తనకు సాయం చేస్తుందని పద్మ భావించింది. నన్ను చాలా టార్చర్ పెట్టింది. అన్ని చోట్ల వెళ్లి మహిళా పోలీస్ స్టేషన్లలో నాపై కేసులు పెట్టింది. నాపై కంప్లైట్ లు పెట్టి నన్ను జాబ్ చేసుకోనివ్వకుండా టార్చర్ పెట్టింది. అందుకే పద్మను హత్య చేశా” అని నిందితుడు వేణుగోపాల్ చెప్పాడు.(Tirupati Padma Murder Case)

Husband murder Wife: భార్యను హత మార్చిన ‘సాఫ్ట్‌వేర్’ భర్త: తిరుపతిలో దారుణ ఘటన

తిరుపతిలోని సత్యనారాయణపురంలో పద్మావతి మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. పద్మను భర్తే హత్య చేసినట్లు తేల్చారు. నగర శివారులోని వెంకటాపురం చెరువులో ఆమె మృతదేహాన్ని గుర్తించారు.

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ వేణుగోపాల్‌తో పద్మకు 2019లో వివాహమైంది. కొన్నేళ్లపాటు వీరి కాపురం సజావుగా సాగింది. ఆ తర్వాత కుటుంబ కలహాలతో భార్యా భర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో దిశ పోలీస్‌స్టేషన్‌లో వేణుగోపాల్‌పై పద్మ ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు వేణుగోపాల్‌, అతడి కుటుంబసభ్యులను పోలీసులు పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అనంతరం కొద్దికాలంపాటు వాళ్ల కాపురం బాగానే కొనసాగినా మళ్లీ విభేదాలు తలెత్తాయి. దీంతో వేణుగోపాల్‌ను విడిచిపెట్టి పద్మ పుట్టింటికి వెళ్లిపోయింది.

TV Actress : టీవీ నటి ఆత్మహత్యాయత్నం.. నిమ్స్‌కి తరలించిన పోలీసులు..

ఆ తర్వాత వేణు వెళ్లి అత్తమామలకు నచ్చజెప్పి భార్యను మళ్లీ తన ఇంటికి తీసుకొచ్చాడు. జనవరి 5న పద్మను ఇంటికి తీసుకురాగా.. ఇంటికి చేరిన అరగంటలోనే ఆమెతో గొడవపెట్టుకున్నాడు భర్త వేణు. కోపంతో ఊగిపోయిన వేణు.. కర్రతో బలంగా పద్మ తలపై మోదాడు. దీంతో పద్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. హత్యను కప్పిపుచ్చేందుకు వేణుగోపాల్ పద్మ డెడ్ బాడీనీ చీరల్లో చుట్టి సూట్ కేసులో పెట్టాడు. ఆ తర్వాత తన ఫ్రెండ్, కుటుంబసభ్యుల సాయంతో సూట్ కేస్ ను తిరుపతి శివారులోని వెంకటాపురం చెరువులో పడేశాడు. ఆ తర్వాత హైదరాబాద్‌ వెళ్లిపోయాడు.

Hyderabad : గచ్చిబౌలి యువతి రేప్ కేసులో కొత్త ట్విస్ట్

జనవరి నుంచి పద్మ తనతోనే ఉన్నట్లు అత్తమామలను నమ్మించాడు. అయితే, 5 నెలలుగా తమ కుమార్తెతో మాట్లాడనీయకుండా చేయడంతో పద్మ తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. ఈ నెల 27న తిరుపతి తూర్పు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు హైదరాబాద్‌ నుంచి వేణుగోపాల్‌ను రప్పించారు. తమదైన స్టైల్ లో విచారించగా.. వేణుగోపాల్ నిజం కక్కేశాడు. పద్మను తానే హత్య చేసి చెరువులో పడేసినట్లు తెలిపాడు. హత్య ఎలా చేసింది.. డెడ్ బాడీని ఎలా మాయం చేసిందీ.. అన్ని విషయాలను పూసగుచ్చినట్లు వివరించాడు. వేణుగోపాల్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు చెరువు వద్దకు వెళ్లారు. కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని బయటకు తీయించారు.

కట్టుకున్న భర్తే.. భార్యను చంపి చెరువులో పడేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. ఈ క్రైమ్ స్టోరీ గురించి తెలిసినోళ్లు షాక్ కి గురవుతున్నారు.