Krishna Tomato : వంద కిలోల టమాటాలను దొంగిలించారు..

టమాటా ధర ఇప్పట్లో తగ్గే అవకాశం లేదని..క్రిసిల్ అధ్యయనం వెల్లడిస్తోంది. ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా వంద కిలోల టమాటాలు చోరీ కావడం కలకలం రేపుతోంది.

Krishna Tomato : వంద కిలోల టమాటాలను దొంగిలించారు..

Tomato

Tomato Theft : టమాటాల రేట్లు అధికం అవడంతో దొంగల దృష్టి వాటిపై పడింది. వాటిని చోరీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఉల్లిగడ్డ దొంగతనాలు జరిగిన సంఘటనలు తెలిసిందే. తాజాగా…టమాటాలను చోరీ చేశారు దొంగలు. ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా వంద కిలోల టమాటాలు చోరీ కావడం కలకలం రేపుతోంది. పెనుగంచిప్రోలు సత్రం మార్కెట్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.

Read More : Mercedes-Benz : ఎలక్ట్రిక్‌ Vision EQXX కారు వస్తోంది.. సింగిల్ ఛార్జ్‌‌తో వెయ్యి కి.మీ దూసుకెళ్తుంది!

అకాల వర్షాలు రైతన్న నడ్డి విరిచాయి. వేల ఎకరాల పంటలు నీట మునిగిన సంగతి తెలిసేందే. వర్షాల ఎఫెక్ట్ టమాటాలై పడింది. ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. కిలో రూ. 100కు పైగానే పలుకుతుండడంతో సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. టమాటా ధర ఇప్పట్లో తగ్గే అవకాశం లేదని..క్రిసిల్ అధ్యయనం వెల్లడిస్తోంది. ఏపీలో సాధారణానికి మించి 40 శాతానికి పైగా వానలు నమోదయ్యాయి. పలు రాష్ట్రాల్లో అత్యధికంగా వానలు కురవడం..అత్యల్పంగా వానలు ఉండడం అధిక ధరలకు కారణమని అంటున్నారు.

Read More : New Variant : రెండు డోసులు వేసుకుంటేనే..రాష్ట్రంలోకి రానిస్తాం..మళ్లీ ఆ రోజులు వస్తాయా ?

ఏపీలో కూడా టమాటా ధరలకు రెక్కలొచ్చాయి. టమాటాల రేటు అధికంగా పలుకుతోంది. దీనిని క్యాష్ చేసుకోవాలని దొంగలు ప్రయత్నించారు. సత్రం మార్కెట్ లోకి టమాటాలు వచ్చాయి. అక్కడున్న ట్రేలలో టమాటాలను ఉంచారు. ఒక్కో ట్రే 20 కిలోలు ఉంటుంది. అందులో వ్యాపారస్తులు టమాటాలను ఉంచారు. కానీ…2021, నవంబర్ 27వ తేదీ శనివారం సాయంత్రం ఐదు ట్రేలలో ఉన్న టమాటాలు కనిపించలేదు. దీంతో దొంగలు వాటిని ఎత్తుకెళ్లారని చిరు వ్యాపారస్తులు గ్రహించారు. వీరికి దాదాపు రూ. 10 వేల రూపాయలకు పైగా నష్టం వాటిల్లినట్లు అంచనా.