Chandrababu : కేంద్ర హోంమంత్రి అమిత్‌షా‌తో భేటీ కానున్న చంద్రబాబు.. పొత్తుల కోసమేనా..?

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయ పరిస్థితులు, పొత్తులు,విభజన అంశాలపై చర్చ జరుగుతున్న వేళ చంద్రబాబు షాతో భేటీ వెనుక ఆంతర్యం ఏమిటి? ఎన్డీయే ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేసిన తరువాత చంద్రబాబు తొలిసారి అమీషాతో భేటీ వెనక ప్లాన్ ఏంటీ..?

Chandrababu : కేంద్ర హోంమంత్రి అమిత్‌షా‌తో భేటీ కానున్న చంద్రబాబు.. పొత్తుల కోసమేనా..?

Chandrababu meet Amit Shah

Chandrababu meet Amit Shah : టీడీపీ అధినేత చంద్రబాబు ఈరోజు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ కానున్నారు. ఇప్పటికే అమిత్ షా చంద్రబాబుకు అపాయింట్ మెంట్ ఇవ్వటంతో సాయంత్రం ఢిల్లీ వెళ్లిన వెంటనే ఆరుగంటలకు షాతో భేటీ కానున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయ పరిస్థితులు, పొత్తులు, విభజన అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. 2019 ఎన్నికల్లో బీజేజీతో కలిసి పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత జరిగిన పరిణామాలతో ఎన్డీఏ నుంచి చంద్రబాబు ప్రభుత్వం వైదొలిగినంది. ఆ తరువాత బీజేపీతో చంద్రబాబు కలిసిందిలేదు. అధికారికంగా కాకపోయినా ఓ సందర్భంగా చంద్రబా ప్రధాని మోదీ మాట్లాడుకున్నారు. దానికి మించి బీజేపీతో ఎటువంటి సత్సంబంధాలు లేవు. ఎన్డీయే ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేసిన తరువాత చంద్రబాబు తొలిసారి అమీషాతో భేటీ కాబోతున్నారు.

2019 ఎన్నికలకు ముందు రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తుందంటూ ఎన్డీఏ నుంచి వైదొలిగిన టిడిపి.. ఏపీలో ఎన్నికలకు ఏడాది సమయం మాత్రమే ఉండడంతో అమిత్ షా తో చంద్రబాబు భేటీ పై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఏపీలో పొత్తులో ఉన్న బీజేపీ, జనసేన కలిసి ముందుకెళ్లేందుకు సుముఖంగా ఉన్న విషయం తెలిసిందే. ఇక వీరితో పాటు బీజేపీ కూడా కలిసి వస్తే బాగుంటుందని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. దీని కోసం బీజేపీ అధిష్టానాన్ని ఒప్పిస్తానని కూడా తెలిపారు పవన్. కానీ ఏపీ బీజేపీ నేతలు మాత్రం టీడీపీతో కలిసి ముందుకెళ్లేందుకు సుముఖంగా లేరన్నట్లుగా తెలుస్తోంది.

Andhra Pradesh : ఏపీకి బీజేపీ అగ్రనేతలు.. విశాఖకు అమిత్ షా, తిరుపతికి జేపీ నడ్డా

టిడిపితో కలిసి వెళ్లేందుకు సుముఖంగా ఉన్న జనసేన ఏపీ బీజేపీ విముఖత చూపడంతో.. నేరుగా అధిష్టానం నుంచి పొత్తుల ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇటువంటి తరుణంలో చంద్రబాబు సడెన్ గా ఢిల్లీ వెళ్లటం.. అమిత్ షాతో భేటీ కావటం రాజకీయంగా ప్రాధాన్య సంతరించుకుంది. మధ్యాహ్నం రెండు గంటలకి ఢిల్లీ బయలుదేరనున్న చంద్రబాబు సాయంత్రం 6 గంటలకు అమిత్ షా భేటీ కానున్నారు.

కాగా ఏపీకి బీజేపీ అగ్రనేతలు వస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీకి వస్తున్నారు. జూన్ 8న అమిత్ షా విశాఖకు వస్తుండగా, 10న తిరుపతికి జేపీ నడ్డా రానున్నారు. మోదీ 9ఏళ్ల పాలనపై ఏపీలో రెండు భారీ బహిరంగ సభలకు బీజేపీ ప్లాన్ చేసింది. 8న విశాఖలో జరిగే బహిరంగ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొంటారు. 10న తిరుపతిలో జరిగే బహిరంగ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొంటారు.